రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని తన కుమార్తె మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత,రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కే.కేశవరావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే పాల్గొన్నారో తెలంగాణ అభివృద్ధిలో కూడా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. వాతావరణ మార్పుల అరికట్టేందుకు చెట్లు ఎంతో తోడ్పడతాయనీ… ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజున లేదా ఏదైనా పండుగ రోజున గాని మొక్కలు నాటాలని, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి జీవితంలో బాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కేకే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, టీఆరెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.