mt_logo

నేడు బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశం

హైదరాబాద్ : బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన… ఈ భేటీలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. సుమారు 290 మంది ప్రతినిధులు పాల్గొం టారని తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. కర్ణా టక ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక లకు సన్నద్ధత మరియు పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల అమలు, గవర్నర్ తిరస్కరించిన బిల్లులను తిరిగి ఆమోదింపజేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం తదితర విషయాలపై సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేసే అవకాశముందని అంచనా.