mt_logo

ఒక వైపు మహారాష్ట్ర నుంచి మరోవైపు మధ్యప్రదేశ్ నుంచి  బీఆర్ఎస్ లోకి చేరికల పరంపర

 ‘అందని చాంద్ సితారాలను ఎట్లాగూ  అందివ్వలేరు….కనీసం అందుబాటులో వున్న నీరు విద్యుత్తు నైనా దేశ రైతాంగం కోసం ఎందుకు  అందించలేకపోతున్నా’రని.. 75 ఏండ్లుగా దేశాన్నేలుతున్న కేంద్ర పాలకులను  బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎద్దేవా చేశారు. కేంద్ర పాలకులను ఈ దిశగా నిలదీసే దిశగా ప్రతీ దేశ పౌరుడు జాగృతం కావాల్సిన అవసరమున్నదని పునరుద్ఘాటించారు. బుధవారం నాడు మధ్యప్రదేశ్ కు మహారాష్ట్రకు చెందిన వందలాది మంది నేతలు కార్యకర్తలు అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఒక వైపు మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతుండగా…మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి చేరికలు ఊపందుకున్నాయి. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అధినేత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ….75 ఏండ్ల  స్వాతంత్ర భారత దేశంలో రైతులు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు సాగునీరు విద్యుత్తు నేటికీ అందట్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని పాలకుల నిర్లక్ష్యధోరణులు ఇంకా కొనసాగకుండా దేశ ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ప్రతి వొక్కరిమీద వున్నదని సీఎం పునరుద్ఘాటించారు. తెలంగాణ లో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నపుడు  దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావని ప్రశ్నించారు. కేంద్రాన్నేలుతున్న పాలకులకు చిత్తశుద్దిలోపం వల్లనే ప్రజలకు నష్టం జరుగుతున్నదన్నారు. ‘‘మనమేమన్నా వాల్లను చంద్రున్నీ  సుక్కలు తెచ్చి ఇమ్మంటున్నమా…? మన జీవితానికి అత్యవసరమైన మనకు ప్రకృతి అందుబాటులో వుంచిన, తాగునీటిని సాగు నీటిని విద్యుత్ ను మాత్రమే ఇవ్వమని అడుగుతున్నం. ‘‘చాంద్ సితారో చోడో….పానీ బిజిలీ జోడో’’ (చాంద్ సితార లను వదిలేయండి మాకు నీళ్లు విద్యుత్తును అందించండి) అని కేంద్ర ప్రభుత్వాలకు సీఎం కేసీఆర్ చురకలంటించారు. 

బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర సర్పంచులు :

మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే వున్నాయి.  మహారాష్ట్రకు చెందిన పలు గ్రామాలకు చెందిన యాభైమంది సర్పంచులు బుధవారం నాడు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారు పార్టీలో చేరడానికి ముందు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. వ్యవసాయం తాగునీరు సాగునీరు విద్యుత్ రోడ్లు సహా పలు రంగాల్లో  రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వారి పరిశీలించారు. ఆసరా ఫించన్లు, రైతుబంధు దళిత బంధు సహా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. తమ తమ గ్రామాల్లో కూడా తెలంగాణ మోడల్ పాలన అమలు కావాలనే ధృఢమైన ఆంకాంక్షతో వారు బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో మహారాష్ట్రకు చెందిన పలువురున్నారు. వారిలో… వెంకట్ రావు జీ ఘోపడే, అల్హత్ అశోక్, రాంరావ్ మహారాజ్ భటేగావ్కర్,రమేష్ కదమ్, గౌతం జైన్, పాటిల్ రాజ్ కుమార్, ఘోడ్కే విఠల్, షేక్ మొహినోద్దీన్, షిండే మాధవ్, కల్యామ్‌కర్ అబాసాహెబ్, వాంఖడే పాటిల్, కార్లేకర్ మహారాజ్, రియాజ్, భగీరథ్ భాల్కే,దోడే మేడం, హరిదాస్ బద్దె, మాధవరావు తోటకే, గోవిందరావు భన్వర్, జిదేంద్ర జైన్, సోలంకే గురూజీ,  జయమంగల్ ధనరాజ్, ప్రవీణ్ పాటిల్ దాఘే (బోల్సా), దత్తా పాటిల్ దాఘే (ఈజాతజ్ఞవ్), సంతోష్ గుటే కర్మలా, హేమంత్ మల్హారే (హిరద్‌గావ్),  కిషన్ కదం (మండల), నగేష్ పాటిల్ చవాన్ (బోల్సా బు), విట్టల్ తోపే (బోల్సా ధనోర బు), దేవిదాస్ షిండే వాఘాల, యోగేష్ ధాగే (ఈజల్‌గావ్), శ్రీధర్ హన్బరాడే (బెజెగాన్),రాజేష్ మోర్ (ఉమ్రి),  షేక్ మొయిన్ తమన్నావాలే, షేక్ సర్ఫరాజ్ అహ్మద్, మౌల్వీ ఉస్మాన్ రెహమాన్ షేక్, అజ్మత్ పటేల్, గులాం మొహమ్మద్ అబ్బుబకర్, మహబూబ్ ఖాన్, హఫీజ్ అహ్మద్ ఖాస్మీ, షేక్ గని షేక్ మోయిన్, షేక్ గౌస్ షేక్ రషీద్, సయ్యద్ సాజిద్ అలీ, అహ్మద్ భాయ్ షాహపుర్కర్, జాకీ మొహమ్మద్, అఫ్తాబ్ అహ్మద్, అఫ్రోజ్ మౌల్లానా, ఫిరోజ్ ఖాన్, జలీషా ఖాద్రీ,  ఖలీల్ పటేల్ వాహబ్ పటేల్, ఖలీల్ పటేల్, అయూబ్ పటేల్, మొహ్సిన్ ఖాన్ గఫర్ ఖాన్, సాబర్ మహ్మద్, చాంద్ పాషా ఖాన్, అబ్దుల్ రజాక్ మోయిన్, డి.ఎం.పాటిల్, టైడల్ క్లౌడ్, దిలీప్ గైక్వాడ్, బాలాసాహెబ్ ధోత్రే, కాసిం పఠాన్, సుదర్శన్ ఘడ్గే,  ప్రశాంత్ కిర్వాలే, విట్టల్ వాగ్మరే, ఐకాన్ పంచాల్, గోపాల్ మనే, రాజ్‌కుమార్ మోహితే, రఘువీర్ లోంధే, అభిషేక్ ఉకీర్డే, అమిత్ దార్వే, రిషికేష్ దేవర్సే, శేషారావు మానె, శుభమ్ ఖండ్కే, మస్తాన్ షా, MD రెహ్మత్ షా, అందర్ షా ఖాజా షా, సంజయ్ ఉర్కిడే, ముస్తఫా సయ్యద్..తదితరులున్నారు.