శాసనసభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అధికార పార్టీ సభ్యులపై చేసిన విమర్శలపై ఐటీ శాఖామంత్రి కేటీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ సభ్యులకు సీరియస్ నెస్ లేదని అనడం మంచి పద్ధతి కాదని, పెద్దగా నోరు చేసుకుని మాట్లాడటం సరికాదని కేటీఆర్ అన్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టడం మంచిదికాదని, ఏదైనా అంశంపై చెప్పాలనుకుంటే ముక్కుసూటిగా చెప్పాలి కానీ, అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని సూచించారు. ఒకేసారి రుణమాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని, విపక్షాలు చెప్పిన అభిప్రాయాలను స్వీకరిస్తామని కేటీఆర్ అన్నారు.