శాసనసభలో రైతు సమస్యలు, ఆత్మహత్యలపై వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్చ ప్రారంభించగానే ప్రతిపక్షాలు చర్చను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ మొదటగా రైతు సమస్యలపై చర్చించుకుందాం.. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే రైతు సమస్యలపై చర్చ ప్రారంభించాం.. అన్ని సమస్యలపై మాట్లాడుకుందాం. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతిపక్షాలు నిర్ణయాత్మక సలహాలు ఇవ్వాలని, ఉత్తమమైన సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.