శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఉభయసభలు మధ్యాహ్నం రెండు గంటలవరకు కొనసాగాయి. అనంతరం రేపటికి సభలు వాయిదా వేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. సభ ప్రారంభం కాగానే రైతు సమస్యలపై మొదట వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్చ ప్రారంభించగా, అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ కొనసాగిన విషయం తెలిసిందే.