mt_logo

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇరిగేషన్ శ్వేతపత్రం సత్యదూరంగా ఉంది: హరీష్ రావు

ఇరిగేషన్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో మాట్లాడారు. హరీష్ రావు ప్రసంగంలోని ముఖ్యాంశాలు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉంది.

సభలో ఇచ్చిన పుస్తకం తప్పుల తడకగా ఉంది.

అబద్ధం 1
మిడ్ మానేర్ ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి అయ్యింది అన్నారు. కాలేదు. అప్పుడు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేము వచ్చాక 775 కోట్లు మేము పూర్తి చేసి నీళ్ళు ఇచ్చాం.

అబద్ధం 2
ఖర్చు, ఆయకట్టు విషయంలో తప్పుగా చెప్పారు. ఒక్కో పేజీలో ఒక్కో విధంగా చెప్పారు.

అబద్ధం 3
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మేము కేంద్రానికి పిర్యాదు చేయలేదు అన్నారు. తప్పు అది. 5- 5- 2020 జీఓ నాడు వచ్చింది. అయితే జనవరి లోనే మేము కేంద్రానికి ఫిర్యాదు చేశాము.

అబద్ధం 4
కేఆర్ఎంబీకి అప్పగించాలని గెజిట్ ఇస్తే మేము సవాల్ చేయలేదు అని పేజీ 14 లో చెప్పారు. అది తప్పు మేము వ్యతిరేకిస్తూ అలెక్స్ కౌన్సిల్ రిఫర్ చేయాలని చెప్పాము.

అబద్ధం 5
కేఅర్ఎంబీకి అప్పగించింది మేము అన్నారు. అవాస్తవం. మీరు అధికారంలోకి వచ్చాక బోర్డుకు అప్పగించినట్లు చెప్పే మినట్స్ ఆఫ్ ద మీటింగ్ ముందు పెట్టాము. ఇదే విషయం అన్ని పత్రికల్లో వచ్చింది.

అబద్ధం 6
50:50 రేషియో కోసం మేము కొట్లడలేదు అన్నారు. రాష్ట్ర విభజన నుండి ఎన్నోసార్లు కొరాము. ఫిర్యాదులు చేశాం. న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్ వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాం.

ఒక ప్రాజెక్టుకు నాలుగు సార్లు ఫౌండేషన్ వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 20087-08లో కొబ్బరికాయ కొట్టారు. రూ. 168 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మోబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ. 1400 కోట్లు బిల్లులు లేపారు.

తప్పు లేనట్లు ఉత్తం గారు మాట్లాడారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడాన్ని కాగు సైతం తప్పు పట్టింది.

ప్రాణహిత ప్రాజెక్టు రి ఇంజినీరింగు సంబంధించి కేసీఆర్ గారు సబ్ కమిటీ వేశారు. అందులో తుమ్మల నాగేశ్వర రావు గారు కూడా సభ్యులుగా ఉన్నారు.

అనేక రోజులు మాట్లాడి, విశ్లేషణలు చేసిన తర్వాత రీ ఇంజినీరింగ్ కు వెళ్లాల్సి వచ్చింది.

నిజానికి ప్రాజెక్ట్ మార్చాలి అనుకోలేదు. అప్పటి కాంగ్రెస్ ఎలాంటి 7 ఏళ్లలో ఎలాంటి ప్రాజెక్ట్ అనుమతులు సాధించలేదు.

మా ప్రభుత్వం ఏర్పడ్డ నాలుగు రోజుల్లోనే ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని నాడు కేసీఆర్ గారు లేఖ రాశారు.

మహారాష్ట్రతో మేము అనేక సంప్రదింపులు చేశాము.
గతంలో మహారాష్ట్ర సీఎం నాడు ఏపీకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాదు, చేసే ఖర్చు వృధా అవుతుందని చెప్పారు. అయినా పట్టించుకాకుండా ప్రాణహిత విషయంలో ముందుకు వెళ్ళారు.
తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవు అని నాడు CWC కూడా చెప్పింది.

2007 నుండి 2014 దాకా కేంద్రంలో, ఏపీలో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కనీసం అగ్రిమెంట్ చేయలేదు.

మార్చడానికి మూడు వేల ఎకరాలు కాదు, అక్కడ నీళ్లె లేవని CWC చెప్పింది.

జలాశయాల సామర్థ్యం సరిపోదని కేంద్రం రిపోర్ట్ చెప్పింది.

ఉమ్మడి పాలనలో 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి.అది కాంగ్రెస్ పాలన తీరుకు ఉదాహరణ.

అధికారంలో ఉన్నారు మేము తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. మేము తప్పు చేయలేదు. భయపడలేదు.

కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తని తెలంగాణ కవి లేడు, గళమెత్తని తెలంగాణ గాయకుడు లేడు. ఇట్ల చెప్పుకుంటు పోతే రేపటి దాక చెప్పచ్చు అధ్యక్షా..

ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు. మా పాలనలో పొలాలకు నీళ్ళు ఎలా వచ్చాయి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఆయకట్టు తక్కువ వచ్చినదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారమే, కాళేశ్వరం కింద 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందింది.

1963లో శంకుస్థాపన చేస్తే, ఎస్సారెస్పీ 11 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు ఇచ్చింది 25 వేల ఎకరాలు.

నాగార్జున సాగర్ కు 1955 లో ఫౌండేషన్ వేస్తే 12 ఏళ్ల తర్వాత 98 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారు.

1984 -2014 వరకు అంటే 30 ఏళ్ల వరకు కల్వకుర్తి ద్వారా ఇచ్చింది 13 వేల ఎకరాలు మాత్రమే.

2001 లో దేవాదుల చంద్రబాబు ప్రారంభిస్తే 2014 వరకు ఇచ్చిన ఆయకట్టు 45 వేలు మాత్రమే 14 ఏళ్ల తర్వాత

కాళేశ్వరం విషయంలో మీరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

కాగ్ నివేదిక మీద కాంగ్రెస్ మాట్లాడితే సెల్ఫ్ గోల్ పెట్టుకోవడమే.

చంద్రబాబు కాగ్ నివేదిక అశాస్త్రీయం అన్నారు.
ఆ తర్వాత వై యస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రభుత్వ విధానాలు తప్పు పట్టేందుకు కాగ్ కు అధికారం ఉండదు అన్నారు.
కాగ్ నివేదిక బైబిల్, ఖురాన్, భగవదీత కాదు అని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ గారు మాట్లాడుతూ.. కాగ్ నివేదిక తప్పుల తడక, కాగ్ విషయాలు ప్రామాణికత లేదు అన్నారు.

మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొనేందుకు కాంగ్రెస్ క్షమాపన చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి.

మీ ఖర్చు వృధా కాకుండా మేము చేశాం
రంగారెడ్డి 6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేలా పాలమూరు రంగారెడ్డి మొదలు పెట్టాం. కాల్వలు తవ్వి నీళ్ళు అందించాలి.

చాప్రల్ రిజర్వాయర్ ఉంది. ముంపు గురవుతుంది అని ప్రాజెక్ట్ కు కేంద్రం ఒప్పుకోలేదు.

కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్ర వెళ్లి మాట్లాడారు. ఒప్పించెలా చేశారు

కేంద్ర ప్రభుత్వ వ్యాప్కోస్ చెబితేనే మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ ప్రారంభించాం.

మేడిగడ్డ బ్యారేజ్ కు కావాలని పునరుద్దరణ చేయకుండా చూస్తున్నారు. మొత్తం కూలిపోయి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారనే అనుమానం కలుగుతున్నది.

రాజకీయాలు చేయడం వల్ల తెలంగాణ సమాజం నష్టపోతుంది

వర్షాకాలం వచ్చే లోపు పునరుద్దరణ పనులు చేయాలి. తప్పులు ఎవరు చేసినా శిక్ష వేయండి. మేము కూడా సహించం.

కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు మొదటి ఫిల్లింగ్ కే కొట్టుకుపోయింది.
దేవాదుల పైపులు నాడు పటకుల్లగా పేలి పోయాయి
పంజాగుట్ట ప్లే ఓవర్ కూలిపోయింది.
సింగూరు డ్యాం, ఎల్లంపల్లి, పుట్టంగండి, పోలవరం డ్యాముల్లో ప్రమాదాలు జరిగాయి.

మిషన్ కాకతీయ వల్ల 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి.

నాడు వేల సంఖ్యలో చెరువులు తేగేవి. మిషన్ కాకతీయ వల్ల తగ్గాయి.

ప్రాజెక్టుల ద్వారా నాడు నీళ్ళు ఇవ్వొద్దని నిబంధన ఉండేది. కానీ కేసిఆర్ గారి ఆదేశాలతో 6200 చెరువులను అనుసంధానం చేశాం.

నాడు నేరం అయితే కేసీఆర్ కాలంలో వరం అయ్యింది.

పేరుకు 9 లక్షల ఎకరాలు కానీ, Srsp ద్వారా ఎన్నడూ 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు.

కాల్వలు ఆధునికీకరణ చేసి చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చాం.

పదేళ్లలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కింద, 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేశాం .
31.50 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశాం.

జలయజ్ఞములో నం 35 పనులు మంజూరు చేస్తే, పదేళ్ళలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు.

కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ద్వారా 2014 వరకు 27,300 ఎకరాలకు ఇస్తే, మేము 9 ఏళ్లలో 6లక్షల 36 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం.

నాగార్జున సాగర్ అంచనా 9.7 రెట్లు పెరిగింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ 107 రెట్లు, జూరాల 25 రెట్లు, పులిచింతల 320 రెట్లు, సింగూరు 3.2 రెట్లు, ఎల్లంపల్లి 2.27 రెట్లు పెరిగింది.

కాళేశ్వరం రెండు రెట్లు పెరిగిందని మాట్లాడుతున్నారు.

2005 లో ఇంజినీర్లు పాలమూరు పథకం పై రిపోర్ట్ ఇచ్చారు.

ప్రారంభించిన తర్వాత ఎపీ గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళింది.

మేము కొట్లాడి ఆరు అన్ని రకాల అనుమతులు సాధించాం

ప్రాజెక్టుల వారీగా నీళ్ళు ఇచ్చేలా సెక్షన్ 3 సాధించాం. ఆరు నెలల్లో నీటి వాటా వచ్చేలా మీరు వాదనలు వినిపించాలి.

299 కాదు, 600 టీఎంసీ పైగా నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంటుంది