తెలంగాణ ఉన్నన్నాళ్లూ కాళేశ్వరం పాజెక్టు ఉంటుంది కాబట్టి దాని గురించి గిట్టని కొందరు వాగే వాగుడు పట్టించుకోకుండా వీలైనంత ఎక్కువ సమాచారం ప్రజల దగ్గర ఉండాలి.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఇప్పుడు మేడిగడ్డ బరాజ్‌లో వచ్చిన చిన్న సమస్య ఎందుకొచ్చింది అన్నది. మీరు విని ఉంటారు అంతరిక్షంలోకి మనం శాటిలైట్లు పంపినప్పుడు అనేకసార్లు ఆ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. మళ్లీ శాస్త్రవేత్తలు వాటిని సరిదిద్ది మరో ప్రయత్నంలో అదే ప్రయోగం విజయవంతం అవుతుంది. నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలు అన్నిట్లో ఇలాంటి సమస్య ఎదురవడం మామూలే. ప్రయోగించే రాకెట్లలో ఏదైనా సమస్య వస్తే నాసా సైంటిస్టులో, ఇస్రో సైంటిస్టులో అవినీతిపరులని నిందిస్తామా? లేదు కదా! కాళేశ్వరం కూడా ఒక నూతన వైజ్ఞానిక ఆవిష్కరణ కిందనే వస్తుంది.
ఎందుకని మీకు సందేహం రావచ్చు. ప్రపంచ చరిత్రలో ఒక నదిని 650 మీటర్ల ఎత్తుకు ఎత్తిన ఇంకో ఉదాహరణ లేదు. అది కూడా సుమారు 240 టీఎంసీల నీటిని – ఇది 240 హుస్సేన్ సాగర్‌లతో సమానం! ఈ ప్రాజెక్టులో వాడిన బాహుబలి పంపు ఒక్కోదాని సామర్ధ్యం 139 మెగా వాట్లు.
ఈ ప్రాజెక్టుకు నీటిని తొలుత లిఫ్ట్ చేయడానికి కట్టిన బ్యారేజీనే మేడిగడ్డ. అయితే సహజంగా బ్యారేజీలు తక్కువ నీటిని నిలవ చేయడానికి కడతారు. ధవళేశ్వరం బ్యారేజీ కానీ, ప్రకాశం బ్యారేజీ కానీ 2-3 టీఏంసీల కెపాసిటీ కలిగినవే.
కానీ మేడిగడ్డలో 16 టీఏంసీల స్టోరేజీ చేసి నీటిని పైకి లిఫ్ట్ చేసేలా డిజైన్ చేశారు. ఇంత ఎక్కువ నీటిని బ్యారేజీల్లో సహజంగా నిలవ చేయరు. ఇక్కడ తొలిసారిగా చేయడం, డిజైన్ చేసిన వత్తిడి కన్నా నీటి వత్తిడి ఎక్కువై, బ్యారేజీ పియర్ల కింద ఉన్న ఇసుక కదిలి, 2-3 పాక్షికంగా పియర్లు దెబ్బతిన్నాయనేది ఇంజనీర్ల ప్రాధమిక నివేదికగా తెలుస్తోంది.
ఇంత సంక్లిష్టమైన సాంకేతికతతో కూడుకున్న భారీ ప్రాజెక్టుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తడం సహజం. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం సమయానికి చేయవలసిన రిపేర్లు చేయకుండా ఆ ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రలు చేస్తున్నట్టు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరంలో ఏడు విడి విడి లింకులు ఉన్నాయి. ఇందులో అనేకం స్వతంత్రంగా పనిచేసే విధంగా డిజైన్ చేశారు. అవసరమైన లింక్‌ను అవసరమైనప్పుడు వాడుకునేలా ఉండటం వల్ల ఇప్పటికీ అనేక పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కేవలం కేసీఆర్ మీద కక్షతోనే కాంగ్రెస్ సర్కార్ ఎత్తిపోతలు చేయడం లేదు.