హైదరాబాద్, జూన్ 14: రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా … ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… గతంలో పేద గర్భిణులు ప్రసవానికి ప్రైవేట్ ఆసుపత్రికి పోయేది. ప్రభుత్వం తెచ్చిన కేసీఆర్ కిట్ల ద్వారా వారికి నగదు సాయంతో పాటు, ప్రసవానంతరం ఇచ్చి కిట్లతో నేడు ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి, గతంలో హాస్పిటల్స్ లో 30 శాతం ప్రసవాలు జరిగితే, నేడు 70 శాతం ప్రసవాలు హాస్పటల్స్ లోనే జరుగుతున్నాయి. దానివల్ల మహిళల ఆరోగ్యం బాగుంటుందన్నారు. అనవసరమైన అబార్షన్లు, దుర్మార్గపూరిత చర్యలు కూడా ఉండటం లేదు. సమాజాన్ని కాపాడుకోగలుగుతున్నాం. మాతా మరణాలు, శిశు మరణాలు చాలా తగ్గాయన్నారు. మీ పీఆర్ బాగా పెరగాలి, మీ ప్లానింగ్ బాగుండాలి అని నేను మంత్రి గారిని కోరుతున్నాన్నారు.రాష్ట్రంలో గొప్పగా హాస్పిటల్స్ కట్టుకుంటున్నాం. వరంగల్ లో ప్రపంచంలో ఎక్కడలేనటువంటి సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ను కడుతున్నాం. ఒకప్పుడు నిమ్స్ లో 900 పడకలుంటే తెలంగాణ వచ్చిన తర్వాత 1500 పడకలకు తీసుకునిపోయాం. మరో 2000 పడకలను మనం కట్టుకుంటున్నామన్నారు.
డాక్టర్ల సేవకు నా శిరసాభివందనం
ఉత్తమోత్తమ సేవలు ప్రజలకు అందించడానికి, కరోనా వంటి మహమ్మారి వ్యాపిస్తే కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కరోనా కాలంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ గొప్పగా పనిచేసిందనారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా సోకిన పేషెంట్ పరిస్థితి విషమిస్తే గాంధీ హాస్పటల్స్ కు పంపించే వారు. గాంధీ డాక్టర్లు అటువంటి పేషెంట్స్ ను కూడా బతికించారు. వారి సేవలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గొప్పగా సేవలు అందించారు. వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో మన రాష్ట్రంలోని పరిస్థితులకు అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా వైద్యసేవలు అందించేలా వైద్యులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. వైద్యారోగ్య శాఖ మీదున్న అపవాదును తొలగించుకొని, రాష్ట్రంలో వైద్యశాఖే నెంబర్ వన్ అని పేరొచ్చేలా కృషి చేయాలన్నారు.