mt_logo

బయో ఏషియా సదస్సుకు మరోసారి వేదికవనున్న హైదరాబాద్

బయో ఏషియా సదస్సుకు మరోసారి హైదరాబాద్ వేదికవనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సు ఫిబ్రవరి 24, 25 తేదీల్లో రెండురోజుల పాటు నిర్వహించనున్నారు. కాగా కోవిడ్ నేపథ్యంలో ఈ సారి బయో ఏషియా సదస్సు వర్చువల్ గా జరపనున్నారు. 2022 బయో ఏషియా సదస్సు ” ఫ్యూచర్ రెడీ” థీమ్ పేరుతో నిర్వహించబడుతుండగా… లైఫ్-సైన్సెస్ ఫోరమ్‌కు వర్చువల్‌గా 70కిపైగా దేశాల నుండి 30 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. కాగా బయోఏషియా-2022 ఈవెంట్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థల నుండి ప్రముఖ వక్తలు హాజరవుతారని, బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఫ్లాగ్ షిప్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *