mt_logo

క్వాలిటీ ఆఫ్ లివింగ్@హైదరాబాద్!!

అంతర్జాతీయ సర్వే సంస్థ మెర్సర్స్ నిర్వహించిన క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వేలో దేశంలోనే మొదటిస్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, గార్డెన్ సిటీ బెంగళూరులను అధిగమించింది. అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎంపికయ్యే అనేక అర్హతలు హైదరాబాద్ కు ఉన్నాయని మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్-2015 స్పష్టం చేసింది. మెర్సర్స్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ ప్రపంచస్థాయిలో 138వ స్థానంలో, జాతీయస్థాయిలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. బెంగళూరు 146వ ర్యాంకు, చెన్నై 151వ ర్యాంకు, ముంబై 152వ ర్యాంకు, ఢిల్లీ 154వ ర్యాంకు సాధించాయి.

హైదరాబాద్ లోని రాజకీయ, సాంఘిక వాతావరణం, పౌరసేవలు, సహజసిద్ధ వాతావరణం, మెడికల్ కేర్, వినోద కేంద్రాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ ను ఎంపిక చేసినట్లు మెర్సర్స్ సంస్థ వెల్లడించింది. సాంప్రదాయ వ్యాపార కేంద్రాల విషయంలో ముంబై, ఢిల్లీ లాంటి మహానగరాలను సైతం వెనక్కు నెట్టిందని మెర్సర్స్ సంస్థ ఇండియా ప్రాక్టీస్ లీడర్ రుచికా పాల్ తెలిపారు. అంతర్జాతీయ విద్యాసంస్థలు బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో హైదరాబాద్ ముందుకు దూసుకెళ్లింది. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా హైదరాబాద్ కు మొదటి స్థానం దక్కడంలో ప్రధానపాత్ర పోషించింది. అంతేకాకుండా అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉండటం ఒక ప్లస్ పాయింట్ అని మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *