హైదరాబాద్ కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ ప్రయివేట్ కంపెనీ బోయింగ్ విమాన సంస్థ విడిభాగాలను అందించడంలో విజయవంతం అయ్యింది. విమానాల విడి భాగాల మొదటి కన్‌సైన్‌మెంట్‌ను బోయింగ్ సంస్థకు సకాలంలో అందించినట్లు ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ చోప్దార్ వెల్లడించారు. విమాన విడి భాగాలను తయారు చేసి, సరఫరా చేయడానికి ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీతో 2021, జులైలో బోయింగ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎండీ రాకేశ్ చోప్దార్ మాట్లాడుతూ.. బోయింగ్ సంస్థకు విమానాల విడి భాగాలను అనుకున్న సమయానికే అందించామని తెలిపారు. తమ కంపెనీ తయారు చేసిన విమానాల విడి భాగాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బోయింగ్ విమానాలన్నింటిలో ఉపయోగిస్తారు. ఈ క్రమంలో తెలంగాణకు, దేశానికి ఇది ఒక ముఖ్యమైన సందర్భం అని చోప్దార్ పేర్కొన్నారు. తయారీ ప్లాంట్ ఏర్పాటు నుంచి మొదలుకుంటే.. అనుమతులు, అంచనాలు, ఆడిట్స్ పూర్తి చేసుకుని, విమానాల విడి భాగాలను తయారు చేసి సరైన సమయానికి అందించడం అంత సులభం కాదన్నారు. ఈ మైలురాయిని సాధించేందుకు చాలా కష్టపడ్డామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విమానాల విడి భాగాలను సకాలంలో అందించిన ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీకి బోయింగ్ ఇండియా సప్లై చైన్ ఎండీ అశ్వినీ భార్గవ అభినందనలు తెలిపారు. ఆజాద్ ఇంజినీరింగ్‌తో సుదీర్ఘమైన, విజయవంతమైన భాగస్వామ్యం కోసం తాము ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
- Congress has no warranty but it is giving guarantees in Telangana: Minister KTR
- T-Works invites embedded engineers to participate in ‘Byte Bending Championship 2023’
- There was no cooperation but only discrimination from BJP: KTR lashes at PM Modi
- What’s happening in AP is tussle between two parties: KTR reacts on Naidu arrest
- KTR questions rationale behind Governor’s decision to reject MLCs nomination
- త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో.. అన్ని వర్గాలు సంతోషపడే శుభవార్త: మెదక్ జిల్లా తూప్రాన్‌లో హరీష్ రావు
- సద్ది తిన్న రేవు తలవాలి: మంత్రి హరీశ్ రావు
- తెలంగాణ గ్రామాలకు దేశ స్థాయిలో గుర్తింపు
- కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం నాటి తరాన్ని ఎంతో ప్రభావితం చేసింది: సీఎం కేసీఆర్
- బీసీలకు వ్యతిరేకమని మరోసారి నిరూపించుకున్న బీజేపీ : ఎమ్మెల్సీ కవిత
- తెలంగాణలో కాంగ్రెస్‌కు నో హోప్స్.. రాహుల్‌గాంధీ మాటల్లో లేని గెలుపు ధీమా!
- గవర్నర్‌గారూ.. ఇదేం తీరు.. బడుగులకు పదవిరాకుండా అడ్డుకుంటారా?.. తమిళిసైపై సర్వత్రా విమర్శలు
- గవర్నర్ గారు.. మీ నిర్ణయం దారుణం : మంత్రి హరీశ్ రావు
- 9 ఏళ్లలో మైనారిటీల అభ్యున్నతికి రూ. 10 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ సర్కార్
- సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ: సీఎం కేసీఆర్