mt_logo

కొత్త ఏడాదిలో కొలువుల జాతర

రాష్ట్రంలో మరోసారి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యాక ఏర్పడే ఖాళీలతో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2 ఎ, గ్రూప్ 2బి, విద్యాశాఖ, పోలీసు శాఖ, డిస్ట్రిక్ట్ స్టాఫ్ సెలెక్షన్ (డిఎస్‌సిలు)లు కలిపి లక్ష ఉద్యోగాల వరకు ఉన్నాయి. తొలివిడతగా 50 వేల ప్రభుత్వ ఖాళీలను నింపేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని, తరవాత మరో రెండు దఫాలుగా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు షెడ్యుల్ ను రూపొందిస్తున్నట్లుగా అధికార వర్గాలు వివరిస్తున్నాయి.

కొత్త సంవత్సరంలో దశల వారీగా లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జోనల్, మల్టీజోనల్ ఉ ద్యోగుల విభజన 75 శాతం పూర్తయింది. మొత్తం 1 లక్షా 50 వేల పైచిలుకు ఉద్యోగులకుగాను సుమారు 1 లక్షా 20 వేల మందికి తుది కేటాయింపులు జరిగాయి. ఒకటి రెండు రోజుల్లో మిగిలిన ప్రక్రియ కూడా ముగిసే అవకాశం ఉంది.

కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు :

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం, స్టేట్ రీ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఫోర్త్ క్లాస్ కలిపి 56 వేల మంది స్టేట్ క్యాడర్ ఉద్యోగులను కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు తెలంగాణాకు కేటాయిం చింది. వీళ్లందరినీ ప్రభుత్వం మల్టీజోనల్ కేటగిరీలో కలి పేసింది. సచివాలయంలో 34 శాఖలు, రాష్ట్ర వ్యాప్తంగా 91 హెచ్‌ఓడీల్లో కలిపి 1 లక్షా 50 వేల పై చిలుకు జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులున్నారు. ఇందులో 3 వేలకు పైగా సెక్రటేరియట్ ఉద్యోగులున్నారు. వీళ్లకు విభజన వర్తించదు. మిగిలిన ఉద్యోగుల్లో దాదాపు 1 లక్షా 20 వేల మంది తుది కేటాయింపులు పూర్తయ్యాయి. ఆ డేటాను కంప్యూట ర్‌లోకి ఎక్కిస్తున్నారు. డేటా ఎంట్రీ పూర్తయ్యాక వాళ్లకు ఆదేశాలు జారీ చేస్తారు. ఇక డిప్యూటీ కలెక్టర్ల తుది కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది. మొత్తం 136 మంది కేడర్ స్ట్రెంథ్ కుగాను 123 మంది వర్కింగ్ డీసీలను కొత్త స్థానాలకు కేటాయించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు అనతికాలంలో వెలువడనున్నాయి.

స్థానిక యువతకే పెద్దపీట :

రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను అమలు చేసే క్రమంలో ప్రభుత్వం స్టేట్ కేడర్ పోస్టులను మల్టీజోన్ల పరిధిలోకి తెచ్చింది. తద్వారా కొత్త నియామకాల్లో 95శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే వచ్చేలా వెసులుబాటు కల్పించింది. జోనల్ వ్యవస్థలో మార్పుల వల్ల న్యూమరీ పోస్టులు అవసరం అవుతాయని అధికారుల అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *