mt_logo

హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారింది.. హరీష్ రావును కలిసిన హైడ్రా బాధితులు

రేవంత్‌ రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడు. కానీ పేద, మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నాడు అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారింది. ఎవరికీ కంటిమీద కునుకులేకుండా పోయింది అని అన్నారు.

రాహుల్ గాంధీ.. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. మీరు దేశమంతా తిరిగి బుల్డోజర్ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ముందు తెలంగాణాలో బుడ్జోజర్ రాజ్‌ను ఆపండి అని కోరారు.

24 గంటలు బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం బాధితుల సహాయం కోసం తెలంగాణ భవన్‌లో ఉంటుంది. మీకు మేమంతా రక్షణ కవచంగా నిలబడతాం. మీరు ఫోన్ చేస్తే.. మేం మీకు అండగా నిలబడతాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు అని తెలంగాణ భవన్‌కు వచ్చిన మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులకు హరీష్ రావు భరోసానిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీ అందరి మాటలు వింటుంటే నాకు బాధగా ఉంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మీ ఏరీయాకు వస్తాం. మీకు మేమంతా అండగా ఉంటాం అని తెలిపారు. రేవంత్‌రెడ్డి సోదరునికి నోటీసులిచ్చి 45 రోజులు టైం ఇస్తారా.. పేదోడికైతే రాత్రిరాత్రికే వచ్చి బుల్డోజర్లతో కూలగొడతారా? అని అడిగారు.

కాంగ్రెస్ హయాంలోనే బాధితులంతా ఇండ్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు.
కష్టంతో భూములు కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మున్సిపాలిటీల కెళ్లి పర్మిషన్ తీసుకున్నారు. ఇళ్లు కట్టుకునేందుకు బ్యాంకు కెళ్లి లోన్‌లు పెట్టుకున్నారు. ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టారు. 1993 కాంగ్రెస్ ప్రభుత్వమే వీరికి పరిష్మన్లు ఇచ్చింది. ఇప్పుడు వాటిని కూల్చడం అన్యాయం అని పేర్కొన్నారు.

రేవంత్.. నువ్వు చేస్తున్న గొప్ప పనేంటి..? సుందరీకరణ? కేసీఆర్ మిషన్ భగీరథ పెడితే.. ప్రతీ ఇంటికి నీరంది ప్రజలకు మేలు జరిగింది. కాళేశ్వరం కడితే లక్షాలాది మంది రైతులకు సాగు, తాగు నీరందింది దాని వల్ల ప్రజలకు మేలు జరిగింది. రేవంత్‌ రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడు. పేద మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నావ్. హైడ్రా.. హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారింది. ఎవరికీ కంటిమీద కునుకులేకుండా పోయింది అని ధ్వజమెత్తారు.

సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే పేదల గుండెలు ఆగిపోతున్నాయ్. పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్లు దీవెనలు ఇస్తారు. కానీ, వారి ఉసురు తీస్తే శాపనార్ధాలు పెడతారని మర్చిపోకు. రేవంత్.. నువ్వు మంచి పనులు చేయ్.. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి ఒక్క మంచి పనిచేశావా? అని ప్రశ్నించారు.

నీకు కూల్చడం తప్ప.. కట్టడం తెలీదా? ముర్ఖుడా.. పేదలకు పనికొచ్చే పనిచేయ్.. రాహుల్ గాంధీ.. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. మీరు దేశమంతా తిరిగి బుల్డోజర్ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ముందు తెలంగాణాలో బుడ్జోజర్ రాజ్‌ను ఆపండి అని కోరారు.

రేవంత్ రెడ్డి.. అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోండి.. ఆ తర్వాతే మూసీ మీద ముందుకెళ్లండి. ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. హైడ్రా పేరుతో నాటకాలు ఆడుతున్నావ్ అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.

24 గంటలు మా న్యాయవాదుల బృంధం తెలంగాణ భవన్‌లో ఉంటుంది. వారి నెంబర్ తీసుకోండి.. ఏ అవసరమొచ్చినా.. మా తలుపులు తెరిచే ఉంటాయ్. మీకు మేమంతా రక్షణ కవచంగా నిలబడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి మీ దగ్గరికొస్తాం.. మీకు భరోసా కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.

10 వేల ఇండ్లు ఉన్నాయని ప్రభుత్వం బయలుదేరింది.. కానీ 25 వేల ఇండ్లను కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. మీకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం.. మీరు ఫోన్ చేస్తే.. మేం మీకు అండగా నిలబడతాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు అని పిలుపినిచ్చారు.

పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు, మా గుండే ఆగిపోతుంది అని.. కంటిమీద కునుకు ఉండట్లేదని, మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అని బాధితులు వాపోయారు.

దయచేసి మాకు న్యాయం చేయండి. పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నాం. అన్నం కూడా తిన్మామో లేదో మాకే తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనతో క్షణక్షణం భయంతో గడపవలసి వస్తుంది. గొంతులో అన్నం దిగట్లేదు అని కన్నీటి పర్యంతం అయ్యారు.

అసలు మేము కొన్నప్పుడు ఇలాంటివి ఏవీ మాకు తెలియదు. లక్షల కొద్ది బ్యాంకు లోన్లు తెచ్చి, ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు కూల్చేస్తే తమ పిల్లలు రోడ్డున పడతారు. తెల్లారితే అసలు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. టీవీ చూస్తుంటే భయం అవుతుంది అని తమ బాధలు చెప్పుకున్నారు.

ప్రభుత్వమే తమను మోసం చేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి.
ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే, మా సొంత జీతాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఇలా అక్రమంగా ఇళ్లు కూల్చేయడం సరికాదు అని అన్నారు.