- కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న గవర్నర్
- రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న గవర్నర్.. బీజేపీ రాజకీయ విమర్శలు చేయడం దురదృష్టకరం
ఉస్మానియా హాస్పిటల్ పై గవర్నర్ ట్వీట్, వ్యాఖ్యలు దురదృష్టకరమని మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని CHFW కార్యాలయం ప్రారంభోత్సవం సందర్బంగా విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఉస్మానియా హాస్పిటల్ పై గవర్నర్ ట్వీట్, వ్యాఖ్యలు దురదృష్టకరం. ఉస్మానియా ఆస్పత్రి పై మొదట స్పందించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. జూలై 2015 లో సీఎం కేసీఆర్ ఆసుపత్రిని సందర్శించారు. నూతన భవనం నిర్మాణానికి అప్పుడే రూ.200 కోట్లు ప్రకటించారు. ఆగస్టు 5వ తేదీన కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. అప్పటి నుంచి న్యాయవాదంలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సైతం ఆసుపత్రి నిర్వహణకు భవనం పనికిరాదని నివేదిక ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఐఐటీ హైదరాబాద్ నిపుణులు, ఆర్కే లాజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ తో ఇండిపెండెంట్ కమిటీని వేశాం. వారు కూడా భవనం ఆసుపత్రి నిర్వహణకు పనికిరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా కోర్టు అదే విషయం చెప్పింది. ఫోటో నుంచి పాజిటివ్ నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం.
2014 తో పోల్చితే సీన్ రివర్స్ అయ్యింది
గవర్నర్ ఈ విషయాలన్నీ పక్కనపెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు, భూతద్దం పెట్టి వెతికినట్టు రాజకీయంగా బురదజల్లే వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ప్రపంచమే అబ్బురపడేలా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించింది. 100 రోజుల్లో 1.62 కోట్ల మందికి పరీక్షలు చేసి, 45 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమాన్ని గాని ఇందులో పాల్గొన్న సిబ్బందిని గాని అభినందించడానికి ఎందుకు ఆమెకు ఆమెకు మనసు రాలేదు. నిమ్స్ 900 నుండి 1500 ఆస్పత్రిలో పడకల సంఖ్యను 1500కు పెంచాం. కొత్తగా 2000 పడకలతో విస్తరిస్తున్నాం. దీనిపై కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. కేసీఆర్ కిట్ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వంటి కార్యక్రమాలు అమలు చేసి, ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు పెంచి మాతా శిశు మరణాలను 43 కు తగ్గించాం. ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలను 30 శాతం నుండి 70 శాతానికి పెంచాం. 2014 తో పోల్చితే సీన్ రివర్స్ అయ్యింది. ఇవేమీ ఆమెకు ఎందుకు కనిపించలేదు.
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దేశంలోనే ఒక చరిత్ర
దేశంలో 100% ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పింది. అయినా ఎందుకు అభినందించరు? నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అనే స్థితి నుంచి నేను వస్తా బిడ్డ సర్కార్ దావకాన కు అనే స్థాయికి చేర్చిన విషయం ఆమెకు కనిపించడం లేదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దేశంలోనే ఒక చరిత్ర. గతంలో 20 ఏళ్లకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్ గారు 9 ఏళ్లలోనే 21 కాలేజీలను ఏర్పాటు చేశారు. ఈ విషయంపై గవర్నర్ ఎందుకు స్పందించరు? లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. ఒక డాక్టర్ గా కనీసం ఈ విషయంలోనైనా గవర్నర్ గారు అభినందించాలి కదా?. ప్రశంసిస్తే మేమింకా ఉత్సాహవంతంగా పని చేస్తాం కదా?. మంచి కనబడదు, మంచి వినబడదు, మంచి మాట్లాడను అన్నట్టుగా వ్యవహరిస్తే ఎలా. చెడును మాత్రమే చూస్తాం, చెడు మాత్రమే వింటాం, చెడు మాత్రమే మాట్లాడతాం.. అన్నట్టు వ్యవహరించడం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ కు తగదు.
బస్తీ దవాఖానాలను నీతి ఆయోగ్ ను ప్రశంసించింది
డయాలసిస్ సెంటర్లు గతంలో మూడు ఉంటే 102 కు పెంచాం. నీతి ఆయోగ్ ర్యాంకింగ్లో మూడో స్థానానికి చేరాం. ఇది కనిపించదా? గాంధీ, నిమ్స్, ఉస్మానియా లో పేదలకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా అవయవ మార్పిడి చేస్తున్నారు. వైద్యుల మనోధైర్యం పెంచేలా అభినందిస్తూ ఒక్క మాట కూడా ఎందుకు అనరు? బస్తీ దవాఖానాలను నీతి ఆయోగ్ సైతం ప్రశంసించింది. వీటి ఏర్పాటుతో గాంధీ ఉస్మానియా నిమ్స్ ఫీవర్ హాస్పిటల్ వంటి పెద్ద ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గింది. ఇది ఎందుకు కనబడదు. ఒక వైద్యురాలు అయి ఉండి.. తెలంగాణ వైద్యులు చేసిన కృషి కనిపించకపోవడం బాధాకరం.
రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న గవర్నర్.. బీజేపీ రాజకీయ విమర్శలు చేయడం దురదృష్టకరం. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల నియంత్రణపై ప్రత్యేకంగా అన్ని జిల్లాల డిఎంహెచ్ఓ లతో రివ్యూ నిర్వహించాము. కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులు మిషన్ భగీరథ తో దాదాపు తగ్గిపోయాయి. కీటక జనిత వ్యాధుల నియంత్రణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించాము. ఇప్పటికే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా చాలా వరకు తగ్గాయి. ఇంకా వ్యాధులు నమోదు అవుతున్న జిల్లాలో చర్యలు తీసుకోవాలని సూచించాం. మలేరియా ను గుర్తించే 8 లక్షల రాపిడ్ కిట్లను ఇప్పటికే అన్ని PHC లకు పంపించాం. డెంగీ ని గుర్తించే 1.23 లక్షల ఎలిజా కిట్లను పంపిణీ చేశాం. 26 హాస్పిటలల్లో బ్లడ్ కాంపోనెంట్స్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో డాక్టర్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ప్రక్రియను సులభతరం చేసేలా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పోర్టల్ ను ఆవిష్కరించామని మంత్రి హరీష్ రావు ప్రసంగించారు.