mt_logo

ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు.. ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి?: హరీష్ రావు

ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియాపై కఠిన ఆంక్షలు. ఇదేమి రాజ్యం అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.

వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.

తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి చూపేందుకు వెళ్తున్న మీడియాను సైతం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో బ్యారైకెడ్లు వేసి అడ్డుకోవడం అప్రజాస్వామికం, మీడియా స్వేచ్చను హరించడమే అని అన్నారు.

వాంకిడి గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే. ప్రభుత్వం తమ తప్పేం లేదన్నట్లు వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికే పోదు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం అంటూ దేశవ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్నాం కానీ, ఆ రాజ్యాంగ సూత్రాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా తుంగలో తొక్కుతున్నది అని దుయ్యబట్టారు.

ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియాపై కఠిన ఆంక్షలు. ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి? అని హరీష్ రావు ప్రశ్నించారు.