mt_logo

కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడుతున్నాయి: హరీష్ రావు

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తరగతి గదుల్లో చదువుకు నోచుకోని పరిస్థితి వచ్చింది అని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకటి కాదు రెండు కాదు 43 పాఠశాలలు.. అదీ గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతంలో ఉపాధ్యాయులు లేక మూతపడటమంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలి అని దుయ్యబట్టారు.

ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజనులు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మూతపడ్డ 43 ప్రభుత్వ పాఠశాలలను వెంటనే తెరిపించాలని, టీచర్ల నియామకం జరిగేవరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రికి హరేష్ రావు విజ్ఞప్తి చేశారు.

ఉపాధ్యాయులు లేరన్న కారణంతో రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా చూడాలని, వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.