mt_logo

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంత నష్టం: హరీష్ రావు

ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.. ప్రభుత్వం వైఫల్యం వల్లే ఇంత నష్టం జరిగింది అని విమర్శించారు.

వరద బాధితులకు సహాయం చేసేందుకు మేము వచ్చాం.. ప్రభుత్వం వైఫల్యంపై స్పందించి ఇక్కడకు వచ్చాం. 9 మందిని కాపాడలేకపోయారు. పాలనపై పట్టు కోల్పోయి ప్రతిపక్షాలపై మండిపడుతున్నారు అని దుయ్యబట్టారు.

ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది. కట్టు బట్టలు తప్ప మా దగ్గర ఏమి లేవని వరద బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలి.. కోల్పోయిన వస్తవులకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించాలి అని డిమాండ్ చేశారు.

వరద బాధితులకు కనీసం తాగునీళ్లు, అన్నం అందించలేకపోయారు.. ముఖ్యమంత్రికి వైరాగ్యం ఎక్కువ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల నష్టం జరిగింది ఇప్పటికే మరణించింది 28 మంది అయితే.. ఈ ప్రభుత్వం 16 మంది అని చూపిస్తుంది అని హరీష్ రావు పేర్కొన్నారు.

భక్త రామదాసు, పాలమూరు ప్రాజెక్టులు మునిగిపోయాయి.. ఇప్పుడు పంట నష్టం రూ. 30 వేలు ఎకరానికి ఇవ్వాలి. అధికారంలో ఉమ్మడి ప్రతిపక్షం సహాయం అడగుతున్నావ్. మీ బురద ప్రతిపక్షానికి పూయాలని ముఖ్యమంత్రి చూస్తున్నారు.. వరదల్లో ముఖ్యమంత్రి రాజకీయం చేస్తున్నారు అని మండిపడ్డారు.

ఆరుగురు ఉపన్యాసాలు చెప్పారు తప్ప ప్రణాళిక గురించి మాట్లాడారా.. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ముఖ్యమంత్రి వచ్చారు. ప్రశ్నించిన ఓ అమ్మాయి మీద దాడి చేయాలని బెదిరిస్తున్నారు. ఎమ్మేల్యేగా ప్రజల కష్టాల తెలుసుకోవడాని వస్తే మాపై దాడి చేస్తారా అని ధ్వజమెత్తారు.