mt_logo

యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని సమాజంలో మార్పు తేవాలి: హరీష్ రావు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాజీ మంత్రి హరీష్ రావు నివాళి అర్పించారు.

అంబేద్కర్ బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు.. ప్రజాస్యామ్యం బలోపేతం కావడానికి, అసమానతలను రూపుమాపడానికి ఆయన చేసిన కృషి మరువరానిది అని పేర్కొన్నారు.

యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని సమాజంలో మార్పు తేవాలని హరీష్ పిలుపునిచ్చారు.