mt_logo

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఘాటు విమర్శలు

ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఆచరణలో మాత్రం మాట తప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.

గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు అందలేదు అని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల నుండి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట ఛార్జీలు, కోడిగుడ్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని.. వెంటనే వాటిని చెల్లించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు.