mt_logo

మహిళలను కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి భాష: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

మహిళలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డి భాష ఉంది.. ముఖ్యమంత్రి అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు.. ఇందిరమ్మ రాజ్యం అంటూ మహిళలను అగౌరవపర్చే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వున్నాయి అని అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఎన్ని హామీలు ఉన్నాయో రేవంత్ రెడ్డికి తెలుసా.. మహాలక్ష్మి పధకం కిందనే మూడు హామీలు ఉన్నాయి.. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయల హామీ ఏమైంది. 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ 40 లక్షల మందికి మాత్రమే వర్తిస్తుంది అని పేర్కొన్నారు.

మొత్తం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు వున్నాయి.. గ్యాస్ కనెక్షన్లు కేవలం మహిళల పేరు మీద ఉంటేనే సబ్సిడీ వస్తుందని ప్రభుత్వం చెప్తోంది.. గ్యాస్ కనెక్షన్లు పురుషుల పేరు మీద ఉన్నా సబ్సిడీ వర్తింపచేయాలి.. గ్యాస్ సిలిండర్ డబ్బులు మొత్తం కట్టించుకుని సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాలో వేస్తామని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం బోగస్ పథకంగా మారింది అని సత్యవతి రాథోడ్ విమర్శించారు.

రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపాలి.మహిళలకు సరిపడా బస్సులను ప్రభుత్వం నడపాలి.. ఆరు గ్యారెంటీల చట్టబద్ధత ఏమైంది అని ప్రశ్నించారు.

పింఛన్లు 4,000 ఎప్పటి నుండి అమలు చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూసి ప్రజలు ఓట్లు వేశారు.. గుడ్డిగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని అన్నారు.

రేవంత్ రెడ్డి పరుష పదజాలం మానుకోవాలి.. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే రేవంత్ రెడ్డి ఎజెండా. రేవంత్ రెడ్డి సీటును టచ్ చేసే వాళ్ళు పక్కనే ఉన్నారు..రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్‌లో వున్నారు..తాను జైలుకు వెళ్లానని అందరిని జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు అని పేర్కొన్నారు.

దళితులు,గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 100 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇచ్చింది..రాష్ట్రంలో ఎస్సి,ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేది 100 యూనిట్లేనా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన ఉద్యోగ నియామక పత్రాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు.. తెలంగాణ వచ్చాక ప్రతి జిల్లాకు కేసీఆర్ మెడికల్ కాలేజీ ఇచ్చారు అని సత్యవతి రాథోడ్ అన్నారు

రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు..రాష్ట్రంలో కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారు..రైతులకు ఇస్తామన్న బోనస్ ఏమైంది అని ప్రశ్నించారు.

మేడిగడ్డను రిపేర్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.. ఇందిరమ్మ ఇళ్ళపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.. ఎల్ఆర్ఎస్.ఉచితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అని గుర్తు చేశారు.