mt_logo

2001లో జలదృశ్యంలో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్థానం.. నేడు దేశానికి ఆదర్శం: హరీష్ రావు

సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. 2001 ఏప్రిల్‌లో హైదరాబాద్ జలదృశ్యంతో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్థానం.. నేడు దేశానికి ఆదర్శం అయింది.. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అని పేర్కొన్నారు.

మన పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసింది. రైతు బంధు పథకాన్ని కేంద్రంలో బీజేపీ కాపీ కొట్టి అమలు చేశారు. కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే, రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారు. మన ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు.

ఇచ్చిన హామీలు అమలు చేయాలని నేను రాజీనామా చేస్తానన్న.. నాడు రాజీనామా చేయకుండా ఉన్న వ్యక్తి కిషన్ రెడ్డి. రాజీనామా కోసం జిరాక్స్ పేపరు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి, తప్పించుకొని తిరిగిన వ్యక్తి కిషన్ రెడ్డి. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.

సీఎం తన రాజీనామాను స్పీకర్ ఫార్మట్‌లో ప్రెస్ అకాడమీ చెర్మెన్ శ్రీనివాస్ రెడ్డికి పంపిస్తే, నేను 5 నిమిషాల్లో పంపిస్తాను. నాకు పదవులు ముఖ్యం కాదు రైతులు, ప్రజల ప్రయజనాలు ముఖ్యం. నాడు ఓటుకు నోటు, నేడు దేవుళ్లపైన ఒట్లు.. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, గ్యారెంటీలు అమలు చేస్తావో లేదో చెప్పు రేవంత్ అని హరీష్ అడిగారు.

నేను రుణమాఫీ చెయ్యాలని అడుగుతే కాంగ్రెస్ మంత్రులు నన్ను తిడుతున్నారు.. మీ తిట్లను ప్రజలు గమనిస్తున్నారు. హామీలు అమలు అయ్యే వరకు నేను పోరాటం చేస్తునే ఉంటా.. జిల్లాలను తొలగిస్తాని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అని దుయ్యబట్టారు.

సిద్దిపేట జిల్లాలను ఊడగొట్టాలని చూస్తున్నారు.. జిల్లాలు ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు.