mt_logo

రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ  శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయింది.. రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలన్నారు. మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కేసీఆర్‌నే నమ్ముతారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

ప్రస్తుత పరిస్థితులల్లో నా పైన కూడా కొన్ని అసత్యాలు  ప్రచారం చేస్తున్నారు. అవి ఏవి నమ్మొద్దు. నీను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ విజయం కోసమే పని చేస్తానని అన్నారు. కొన్ని కారణాల వల్ల కొంత మంది ఎమ్మెల్యేలు నాతో విడిపోవచ్చు. అయిన వారి విజయాన్నే నేను కోరుకుంటున్నా అని తెలిపారు. ఉమ్మడి నల్గొండ  జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నాకు అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, మిత్రులు ఉన్నారు. వారందరికీ విజ్ఞప్తి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే గెలిపించండని కోరారు. ఇప్పుడు నాకు పార్టీలు మారాల్సిన అవసరం లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నేను కానీ, నా కుమారుడు కానీ పోటీ చేస్తాము. అంతే కానీ పార్టీ మారమని తెలిపారు.కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. తెలంగాణ బాగుండాలంటే  కేసీఆర్ ఘన విజయం సాధించాలి. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ఘటన  విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదని  సూచించారు. సాంకేతిక సమస్యలు అప్పుడప్పుడు వస్తాయని పేర్కొన్నారు.