mt_logo

గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ 

  • దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: ” ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు లేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి 3 లక్షల ఆర్థిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠం లో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నెంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి ధరఖాస్తులు పంపించవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరుతున్నాం.” అన్నారు  రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

ఈ నెల 20వ తేదీలోగా గృహలక్ష్మి పథకం మొదటి దశ అప్లికేషన్స్ పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి విడతలో అవకాశం కల్పిస్తారు. 

గృహ లక్ష్మి పథకం అప్లై చేసుకొనుటకు కావాల్సిన సర్టిఫికెట్స్:

  • ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్
  • ఫుడ్ సెక్యూరిటీ కార్డు(రేషన్ కార్డు)
  • కుల ధ్రువీకరణ పత్రం(ఎందుకంటే ఈ పథకం వర్తింపులో రిజర్వేషన్స్ కూడా కలవు)
  • నివాస ధ్రువీకరణ పత్రం, ఇంటి పన్ను రశీదు, కరెంట్ బిల్ 
  • సొంత ఇంటి స్థలం కలిగి ఉండాలి
  • ఒకవేళ వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

పైన తెలుపబడిన సర్టిఫికెట్స్ జతచేసి ఎంపీడీవో కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోగలరు.