mt_logo

తెలంగాణ గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్య విధానాలు భేష్‌ : జార్ఖండ్‌ ప్రజాప్రతినిధుల కితాబు

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఆ దిశగా పల్లె ప్రగతి కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. గ్రామాల అభివృద్ధే.. దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించి, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టి గ్రామాల  పరిశుభ్రత, స్వచ్ఛతే లక్ష్యంగా దశలవారీగా పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలు పేరుకుపోయిన చెత్తా చెదారం, మురుగు కాల్వలను శుభ్రపరచడం, పరిసరాలను పరిశుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్‌, నర్సరీ, డంపింగ్‌యార్డుల్లో పిచ్చి మొక్కలు తొలగింపు, వైకుంఠధామాల నిర్మాణం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలతో నేడు పల్లెలు పరిశుభ్రతతో అలరారుతున్నాయి. కాగా, తెలంగాణలో గ్రామాల అభివృద్ధిని తెలుసుకునేందుకు శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్‌నగర్‌ గ్రామ పంచాయతీని వారు సందర్శించారు.

తెలంగాణ  గ్రామాలు అభివృద్ధిలో పచ్చదనం, పరిశుభ్రత భేష్ 

తెలంగాణలోని గ్రామాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని, పచ్చదనం, పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలు భేష్ అని జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్ల బృందం సభ్యులు ప్రశంసించారు. గ్రామంలో ని కార్యక్రమాలను పరిశీలించారు. ప్రతి ఇంటిలో నిర్మించిన మరుగుదొడ్లు, వైకుంఠధామం, సీసీ రోడ్లు, పారిశుధ్య పనులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ ఉచితంగా నీరందించడాన్ని కొనియాడారు. తమ రాష్ట్రంలో కూడా తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు & ఖర్చులు 

  • పల్లె ప్రగతి కార్యక్రమం కింద మొత్తం రూ. 13,528 కోట్లను ఖర్చు చేయడం జరిగింది.
  • ప్రతి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ను ఏర్పాటు చేయడం జరిగింది
  • 12745 గ్రామపంచాయతీల్లో వైకుంఠధామాలు మంజూరయ్యాయి. 
  • 12742 గ్రామపంచాయతీల్లో రూ. 1329.73 కోట్ల ఖర్చుతో వైకుంఠధామాల నిర్మాణం జరిగింది.
  • 12753 గ్రామపంచాయతీల్లో రూ. 279.10 కోట్ల ఖర్చుతో గ్రామ డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తయింది.
  • 12756 గ్రామపంచాయతీల్లో రూ. 238.09 కోట్ల ఖర్చుతో ఫంక్షనల్ నర్సరీలను పూర్తి చేశారు. ఇందులో 20.16 కోట్ల మొక్కలను పెంచారు
  • రూ. 118.68 కోట్లతో 6.61 కోట్ల మొక్కలను నాటారు. 
  • 19472 గ్రామపంచాయతీలు, ఆవాసాల్లో రూ. 238.02 కోట్లతో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. 
  • 1552 ప్రాంతాల్లో 34.79 కోట్లతో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు
  • 3324 కిలోమీటర్లలో మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పూర్తయింది.
  • రూ. 400.57 కోట్ల రూపాయలతో 11,73,496 వ్యక్తిగత, 34,104 సామాజిక మ్యాజిక్ సోక్ పిట్స్ (ఇంకుడు గుంతలు) నిర్మాణం జరిగింది.
  • రూ. 524.57 కోట్లతో 2598 రైతు వేదికల నిర్మాణం జరిగింది.
  • రూ. 143.43 కోట్లతో 22,180 డ్రైయింగ్ ప్లాట్ ఫామ్ ల నిర్మాణం చేపట్టడం జరిగింది.