mt_logo

కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కార్యాలయం నుండి వచ్చిన ప్రతినిధి తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పుష్పగుచ్ఛం, శుభాకాంక్షల లేఖను అందజేశారు.

కేసీఆర్ 70వ జన్మదిన సందర్భంగా భారీ వేడుకలకు తెలంగాణ భవన్ ముస్తాబయ్యింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.