mt_logo

బీసీ హాస్ట‌ళ్ల సీటు కోసం ఎదురుచూస్తున్నా విద్యార్థిని, విద్యార్థులకు గుడ్ న్యూస్

  • బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల ఆన్లైన్ అప్లికేషన్ వెబ్ సైట్ ప్రారంభం
  • https://bchostels.cgg.gov.in ద్వారా హాస్టళ్ సీటు కోసం అప్లికేషన్

హైదరాబాద్, జూన్ 12: రాష్ట్రంలోని 703 బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని సీట్లను ఇకనుండి సంపూర్ణంగా ఆన్లైన్ ద్వారానే భర్తీ చేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇందుకు సంబందించిన వెబ్సైట్ https://bchostels.cgg.gov.in సచివాలయంలో నేడు అధికారికంగా లాంచ్ చేసారు. ఈ విద్యా సంవత్సరం నుండే దీన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. వెబ్సైట్లో సూచించిన ఆన్లైన్ అడ్మిషన్ ఫామ్ నింపి దరఖాస్తు సమర్పించగానే ఎవరి ప్రమేయం లేకుండా వివరాలు వెరిఫికేషన్ చేసుకొని ప్రవేశానికి అవకాశం ఏర్పడుతుందన్నారు మంత్రి గంగుల.