mt_logo

గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండు: మంత్రి కేటీఆర్

  • రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్ మనిషి, బీజేపీ మనిషే
  • భూ దందాలు ధరణి ద్వారా సాధ్యమవుతలేదని అక్కసు

గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు.హైదరాబాద్‌ తెలంగాణ భవన్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడాతూ.. ధరణి విదేశీ చేతిలో ఉందన్న రేవంత్ రెడ్డి గుర్తించాల్సిన మాట.. కాంగ్రెస్ పార్టీ కూడా విదేశీ చేతుల్లోనే ఉంది, రేవంత్ రెడ్డి నోట్లో నుంచి వేల కోట్ల మాట తప్ప ఇంకో మాట రాదన్నారు. ఆయనకు మతిస్థిమితం లేదు, ఇది సెక్రటేరియట్ కింద వేల కోట్లు ఉన్నాయని చేసిన పిచ్చి ఆరోపణలు అందరికీ గుర్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ పైన ఒక మాట ఎందుకు మాట్లాడడు అని ప్రశ్నించారు. 

మోడీని బీజేపీని ఒక మాట అనకుండా రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. అందుకే గాంధీ భవన్లో గాడ్సే దూరిండు అని మేము చెప్పాము. రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్ మనిషి, బీజేపీ మనిషే అన్నారు. మోడీని పల్లెత్తు మాట అనకుండా కాపాడుతున్న వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సైతం అందించి విచారణ చేయించుకోవచ్చు అన్నారు. ధరణి ద్వారా జరిగిన లబ్ధిని మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ప్రజలకు చెప్తం. ఈ అంశాన్ని ప్రజలే తేల్చాలన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన రేవంత్ రెడ్డి… ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ అయితే ఓర్వలేక పోతున్నారు. 

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పని చేసింది

ఆయన భూ దందాలు ధరణి ద్వారా సాధ్యమవుతలేదని ఆయన అక్కసు, గత మూడు సంవత్సరాలలో భారత రాష్ట్ర సమితి మోడీ మీద బీజేపీ మీద చేసిన విమర్శలలో కనీసం 10% అయినా కాంగ్రెస్ పార్టీ చేసిందా? అని అడిగారు. కాంగ్రెస్ బీజేపీ కలిసే కదా కరీంనగర్ పార్లమెంటును గెలిచింది, ఆ తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పని చేసింది. ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకుంటారు. ప్రజలు అమాయకులు కాదు… ఎవరును మోడీని వ్యతిరేకించి, గట్టిగా నిలబడి కొట్టగలరో ప్రజలందరికీ తెలుసన్నారు. మోడీ పైన తల వంచకుండా పోరాటం చేసే వ్యక్తి ఎవరో దేశ ప్రజలందరికీ కూడా అవగాహన ఉందన్నారు. 

అందుకే మహారాష్ట్ర లాంటి చోట కూడా కేసీఆర్ గారి పర్యటనలకు మంచి స్పందన వస్తుందని గుర్తు చేసారు. గత ఎన్నికల్లో కూడా మహాకూటమి పేరు కట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా… ప్రజలు వీపు పగలగొట్టి వెనక్కి పంపించారు, పేదవారి గుండెల్లో సీఎం కేసీఆర్ ఉన్నారు … ఆయనను తిరిగి మళ్లీ గెలిపిస్తారని అన్నారు. 

మోడీ దేశానికి ఏం చేసిండో చంద్రబాబు నాయుడు చెప్పాలి?

నాలుగేళ్ల కింద మోడీని పచ్చి బూతులు తిట్టిన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ  మీటింగ్ హాజరు ఎట్లా అవుతాడని అడిగారు. గత నాలుగు సంవత్సరాలు ఆంధ్ర ప్రదేశ్ కి మోడీ చేసిన మేలు ఏమిటో చంద్రబాబు చెప్పాలి… గత తొమ్మిది సంవత్సరాల్లో ఆంధ్ర తెలంగాణకు మోడీ చేసిన మేలు ఏమిటో చెప్పి హాజరు కావాలన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా మోడీ దేశానికి ఏం చేసిండో అదైనా చెప్పాలన్నారు.