mt_logo

రాహుల్ గాంధీ ఏ హోదాలో హామీలు ఇస్తున్నడో చెప్పాలి: మంత్రి కేటీఆర్

  • పాత రాబందులు నేడు బహు రూపు వేషాల్లో ..
  • కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసు

రాహుల్ గాంధీ ఏ హోదాలో హామీలు ఇస్తున్నడో చెప్పాలన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడాతూ.. అసలు రాహుల్ గాంధీని దేశంలో ఎవరు లీడర్ గా గుర్తిస్తున్నారో చెప్పాలి. పార్టీ అధ్యక్షుడు కాదు.. పార్టీ ఎంపీ కూడా కాదు.. ఏ హోదాతో ఆయన హామీలు ఇచ్చిండో చెప్పాలి… హోదా లేని నాయకులకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు.  55 సంవత్సరాల పాటు తెలంగాణను రాబందుల్లా వేధించుకొని తిన్న కాంగ్రెస్ పార్టీ… రాహుల్ గాంధీ  ముత్తాత నుంచి రాహుల్ దాకా కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసు. పాత రాబందులు నేడు బహు రూపు వేషాల్లో మళ్లీ వచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు.