mt_logo

తెలంగాణలో గోద్రెజ్ అగ్రోవెట్ రూ.250 కోట్ల పెట్టుబడులు

గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ తెలంగాణలో రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఖమ్మంలో వంట నూనెల శుద్ది కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆ కంపెనీ ఎండీ బలరాం యాదవ్ గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి వివరించారు. పామాయిల్ ను ఉత్పత్తి చేయనున్న ఈ కంపెనీమొదట 30 టీపీహెచ్ సామర్థ్యం గల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి, దాన్ని క్రమంగా 60టీపీహెచ్ సామర్థ్యం వరకు విస్తరించనున్నట్టు గోద్రెజ్ అధికారులు తెలిపారు. 2025-26 వరకు పూర్తి స్థాయిలో యూనిట్ పని చేస్తుందని అన్నారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… వంట నూనెల దిగుబడిని తగ్గించేందుకు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని, తద్వారా రాష్ట్రంలో పసుపు విప్లవం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు పేర్కొన్నారు. గోద్రెజ్ స్థాపించబోయే ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి లభించగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభించనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *