mt_logo

ఆకర్షణయమైన పెట్టుబడులకు కేంద్రంగా జీనోమ్‌ వ్యాలీ : మంత్రి కేటీఆర్‌

ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్‌ వ్యాలీ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం జీనోమ్‌ వ్యాలీలో కేటీఆర్‌ జాంప్‌ ఫార్మాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా తర్వాత హైదరాబాద్‌లోనే పెద్ద జాంప్ ఫార్మా బ్రాంచ్‌ను ప్రారంభించిందని పేర్కొన్నారు. తమ కార్యాలయానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న జాంప్ ఫార్మా, 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. కంపెనీల విస్తరణకు హైదరాబాద్‌లో అపార అవకాశాలున్నాయని తెలిపారు. అన్ని రకాలుగా ఫార్మా సంస్థలకు జీనోమ్‌ వ్యాలీ అనువుగా ఉంటుందని, యూనిట్ల స్థాపనకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలన్నారు. గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు అహ్మదాబాద్‌ కంటే హైదరాబాద్‌నే ఇష్టపడుతున్నారన్నారు. గ్లోబల్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ వాటా 33శాతం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అద్భుతమైన సహకారం అందిస్తుందన్నారు. 28 రోజుల్లోనే జాంప్‌ ఫార్మాకు భూమిని కేటాయించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బీ-హబ్ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని తెలిపారు. బీ-హబ్ నిర్మాణంతో పాటు జీనోమ్ వ్యాలీ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. త్వరలో బీ-హబ్‌ను ప్రారంభించి, బయోలాజికల్‌ పరిశోధనలకు తోడ్పాటునందించబోతున్నామని కేటీఆర్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *