mt_logo

సొంత జిల్లాలో రేవంత్‌కి షాక్.. తిరిగి బీఆర్ఎస్‌ గూటికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిని తన సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో షాక్ తగిలింది. మూడు వారాల క్రితం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈరోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. రుణమాఫీ కంటే ఇదే పెద్ద న్యూస్ అవుతుందని ఈ చేరికనుద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ నుండి చేర్చుకున్న ఎమ్మెల్యేలను కూడా రేవంత్ రెడ్డి కాపాడుకోలేకపోతున్నాడని రేవంత్ నాయకత్వంపై సోషల్ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తున్నారు.