mt_logo

తెలంగాణలో ఉచితంగా పేదలకు అవయవ మార్పిడి : మంత్రి హరీష్ రావు

శిల్పకళ వేదికలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు ప్రసంగం.. 

 హైదరాబాద్‌, మే 22 : వైద్య విద్యార్థుల మీద ప్రభుత్వం కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తుంది, దానిని వైద్య సేవల ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వండన్నారు. ప్రాణం పోసేది అమ్మ అయితే, ఆనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారికి వైద్యం అందించి పునర్‌ జన్మ ఇచ్చేది ఒక్క వైద్యుడు మాత్రమే అన్నారు. ఆ వృత్తికి మరింత గౌరవాన్ని పెంచాలని కోరుతున్నాను. దేశాన్ని కాపాడే సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతులు, ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులు ఎంతో గొప్ప వారు. వారందరి సేవలు ఎంతో గొప్పవి. ఒక కుటుంబంలో ఒకరికి రోగం వస్తే, చికిత్స కోసం లక్షల రూపాయలు అప్పు చేసి, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉండేదన్నారు. కుటుంబ పరిస్థితిపై, పిల్లల చదువుపై, వారి భవిష్యత్ ఎంతో ప్రభావితం అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖరీదైన వైద్యం పేదలకు అందుతున్నదన్నారు. 

ఒకప్పుడు అవయవ మార్పిడి అంటే దనికులకే అనే భావన ఉండేది. కానీ తెలంగాణలో ఉచితంగా పేదలకు అవయవ మార్పిడి జరుగుతున్నది. దేశంలో అత్యధిక కిడ్నీ మార్పిడిలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి.. ఈ మార్పు వెనుక సీఎం కేసీఆర్ గారి పట్టుదలతో పాటు, వైద్యారోగ్య శాఖలోని అన్ని స్థాయిల్లోని సిబ్బంది కృషి దాగి ఉంది.  మహబూబాబాద్, నాగర్ కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి వంటి మారుమూల మెడికల్ కాలేజ్ లకు పదుల సంఖ్యలో డాక్టర్లు వెళ్తున్నారు. దీంతో అవి బలోపేతం కానున్నాయన్నారు.

ఒక్కొక్కరి వైద్యం పట్ల చేస్తున్న తలసరి ఖర్చు రూ. 3,532

నీతి అయోగ్ ర్యాంకింగ్ లో తెలంగాణ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాం. అందరం కలిసి మొదటి స్థానానికి వచ్చేలా కృషి చేద్దాం. మిషన్ భగీరథ, పల్లె, ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా సీజనల్ ఫివర్లు దాదాపు తగ్గించాము. బస్తీ దవాఖానలు, పల్లె దవాఖనాల ద్వారా పెద్ద ఆసుపత్రుల్లో ఒపి లోడ్ తగ్గించాం. దీంతో టెర్షియరి సేవలపై మరింత దృష్టి పెట్టి అవకాశం కలిగింది..గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 12,364 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. ఒక్కొక్కరి వైద్యం పట్ల చేస్తున్న తలసరి ఖర్చు రూ. 3,532. దేశంలో మూడో స్థానం. మందులు, పరికరాలు లేవనే పరిస్థితి లేకుండా అన్ని ఆన్ లైన్ చేశాం. టీ డయాగ్నొస్టిక్ ద్వారా ప్రస్తుతం 57 రకాల పరీక్షలు చేస్తున్నాం. మరో నెల రోజుల్లో 134 కు పెంచ బోతున్నమని అన్నారు. గత ప్రభుత్వాలు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదు. దీంతో పిల్లలు చైనా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన దుస్థితి, గతేడాది 8 మెడికల్ కాలేజీలను ఏక కాలంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోబోతున్నాం. ఇందులో ఇప్పటికే 8 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు వచ్చాయని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో నాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవి కేవలం 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే, 9 ఏళ్లలో తెలంగాణ సర్కారు 20 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది, కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీల వల్లనే ఈరోజు మీకు ఈ అవకాశం కలిగింది, 2014కు ముందు తెలంగాణలో (ప్రభుత్వ, ప్రైవేటు) మొత్తం 20 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే ఇప్పుడు 55.. 60 ఏళ్లలో 20 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏళ్లలో 35 మెడికల్ కాలేజీలు చేశాం అని తెలియజేసారు.