mt_logo

రాష్ట్రంలో ఆరు యూనివర్సిటీల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగ ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని ఉద్యోగార్థుల‌కు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాక‌తీయ‌, పాల‌మూరు, శాత‌వాహ‌న‌, మ‌హాత్మాగాంధీ, తెలంగాణ యూనివ‌ర్సిటీల్లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆరు యూనివర్సిటీల్లోని కోచింగ్ సెంటర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వ‌ర్చువ‌ల్‌గా బుధ‌వారం ప్రారంభించారు. శుక్రవారం నుండి ఈ కోచింగ్ సెంట‌ర్లు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. యూనివ‌ర్సిటీల్లో ఉండి ప్ర‌యివేటు కోచింగ్ సెంట‌ర్ల‌కు వెళ్ల‌లేని విద్యార్థుల‌కు ఈ కోచింగ్ కేంద్రాలు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని మంత్రి పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే పోలీసు, విద్య‌, వైద్య శాఖ‌ల్లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వెలువ‌డుతాయ‌న్నారు. కోచింగ్ సెంట‌ర్ల‌లో విద్యార్థుల‌కు ఉచితంగా మెటిరీయ‌ల్ అందిస్తామ‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ‌ల వారీగా ఆయా జిల్లా కేంద్రాల్లో కోచింగ్ సెంట‌ర్లు ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *