
తెలంగాణలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైన విషయం తెలిసిందే.. ఐతే ఇప్పుడు ఆ కంపెనీ మరొక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఫాక్స్ కాన్ సంస్థ ప్రకటించిందని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ (X) ద్వారా తెలిపారు. గతంలో 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫాక్స్ కాన్ గ్రూపుతో తమ స్నేహం స్థిరంగా ఉందని, ఈ పెట్టుబడులు తెలంగాణ అభివృద్ధిని తెలుపుతున్నాయని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు.