రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రపంచరమే అబ్బురపడేలా మన హైదరాబాద్ ఫార్మాలా వన్ ఈ రేసుకు వేదికైంది. భాగ్యనగరం నడిబొడ్డున ప్రపంచ ప్రసిద్ధి ఆటగాళ్లు సందడి చేస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలలేదు. హుస్సేన్ సాగర్ తీరాన ఈ ఏడాది ఫిబ్రవరి 11న మొత్తం 11 టీంలు ఫార్ములా-ఈ రేసులో పాల్గొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 31 వేలకుపైగా మంది వీటిని వీక్షించారు. ఇక్కడికి రాలేని ఫార్మాల ఈ రేస్ అభిమానులు ఆన్‌లైన్‌లో వీక్షించారు. తెలంగాణ సర్కారు పక్కా ప్రణాళికతో ఈ మోటార్స్ పోర్ట్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించడంతో దేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. దీంతో వచ్చే ఏడాదికూడా తెలంగాణ సర్కారు ఈ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు ఈ ఆటలపైనా విషం చిమ్మారు. పైసకు పనికిరాని గేమ్స్ కోసం అంత ఖర్చుచేస్తారా? అంటూ జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కాగా, ప్రపంచంలోనే ప్రఖ్యాత సంస్థ నీల్సన్ స్పోర్ట్స్ అధ్యయనం వారి నోర్లను మూయించింది. ఫార్మాల వన్‌తో తెలంగాణ సర్కారుకు భారీగా ఆర్థిక లబ్ధి చేకూరిందని వెల్లడించింది.
నీల్సన్ స్పోర్ట్స్ అధ్యయనంలో ఏం తేలిందంటే?
-ప్రపంచమే మనవైపు చూసేలా తెలంగాణ సర్కారు హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా వన్ ఈ రేసు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ లాభం చేకూర్చింది.
-ఈ రేసు నిర్వహణ వల్ల హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ. 700 కోట్ల లబ్ధి జరిగింది.
-ఇండియాలో ఏ మెట్రో నగరానికి కూడా దక్కని ఘనతను హైదరాబాద్ నగరం సొంతం చేసుకొన్నది.
-ఈ ఫార్ములా ఈ వన్ రేసు నిర్వహణ వల్ల నగరంతోపాటు ఇతర ప్రాంతాలకూ ప్రయోజనం చేకూరింది.