mt_logo

ట్రాఫిక్ కష్టాలు అధిగమించేందుకు ఫ్లైఓవర్లు, అండ‌ర్ పాస్‌లు : మంత్రి కేటీఆర్

ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు మార్గంలో రూ.9.28 కోట్లతో నిర్మించిన అండర్‌పాస్‌ (కుడివైపు), రూ.28.642 కోట్లతో బైరామల్‌గూడ వ‌ద్ద ఏర్పాటు చేసిన‌ ఫ్లైఓవర్ ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎల్బీన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నాగోల్, బండ్ల‌గూడ‌లో నాలా అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఎల్బీన‌గ‌ర్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని తెలిపారు. రూ. 2,500 కోట్ల‌తో ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో వ‌ర‌ద ముంపు నివార‌ణ‌కు రూ. వెయ్యి కోట్ల‌తో నాలాల అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలో మంచి నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు 12 రిజ‌ర్వాయ‌ర్లు నిర్మించామ‌న్నారు. 353 కిలోమీట‌ర్ల మేర వాట‌ర్ పైపులైన్‌లు వేశామ‌న్నారు. ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకు ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌ల నిర్మాణం చేప‌ట్టిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. గ‌డ్డి అన్నారం మార్కెట్ స్థ‌లంలో సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రిని నిర్మిస్తామ‌న్నారు. ఎల్బీన‌గ‌ర్‌లో భూ రిజిస్ట్రేష‌న్ స‌మ‌స్య కూడా ప‌రిష్కారిస్తామ‌ని హామీ ఇచ్చారు. కొత్త పెన్ష‌న్లు 2 నుంచి 3 నెల‌ల్లో అంద‌జేస్తామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, మ‌హ‌ముద్ అలీతో పాటు ఎల్బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *