రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (నాయిని నరసింహారెడ్డి ఫ్లైఓవర్) ఈ రోజు ప్రారంభించారు.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేకత
హైదరాబాద్ లో ఎస్.ఆర్.డి.పి ద్వారా రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టిన మొట్ట మొదటి స్టీల్ ఫ్లై ఓవర్ గా నిలవనున్నది. మిగతా ఫ్లై ఓవర్ల కంటే భిన్నంగా మొత్తం స్టీల్ తో ఫ్లై ఓవర్ ను పూర్తి చేశారు. మొట్ట మొదటి సారిగా మెట్రో బ్రిడ్జి పై నుండి ఫ్లై ఓవర్ చేపట్టడం జరిగింది. ఫ్లై ఓవర్ స్టీల్ బ్రిడ్జి సివిల్ వర్క్స్, యుటిలిటీ లిఫ్టింగ్, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ. 450 కోట్లను వెచ్చించారు.
ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ పొడవు 2.62 కిలోమీటర్లు కాగా, ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 2.436 కిలో మీటర్లు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ వివరాలు
– ఫ్లైఓవర్ వెడల్పు 16.61 మి.కాజ్వే
– మొత్తం 81 పిల్లర్లు
– స్టీల్ ఫ్లై ఓవర్ మొత్తం 2.620 కీ.మీ. పొడవు, స్టీల్ నిర్మాణం 2437 మీటర్ల పొడవు
– స్పాన్ పొడవు 297 మీ.
– వీఎస్టీ అప్ ర్యాంపు 150 మీ.
– వీఎస్టీ డౌన్ ర్యాంపు 78 మీటర్ అప్రోచ్ వాల్
– లైన్ల బై డైరెక్షన్ ఫ్లై ఓవర్ (16.60 మీటర్లు)
ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) అందుబాటులోకి రావడంతో ఇందిరాపార్క్ జంక్షన్ మొదలు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా బాగ్ లింగంపల్లి వీఎస్టీ జంక్షన్ వరకు పూర్తిగా సిగ్నల్ రహిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం బాగా తగ్గనుంది.