mt_logo

సింగరేణికాలని చైత్ర కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందజేత

సెప్టెంబర్ 9న సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటి పత్రాలనఅందజేశారు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ మంత్రి కార్యాలయంలో చైత్ర తల్లిదండ్రులు సబావాత్ రాజు, జ్యోతిలను కలిసిన సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. చైత్ర కుటుంబానికి జరిగిన దారుణానికి గాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 50 వేల రూపాయలను అందజేయగా.. 15వ తేదీన హోం మంత్రి మహమూద్ అలీ మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ల చేతుల మీదుగా 20 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. కాగా సైదాబాద్ లో ఇటీవల నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోని 514 గల ఇంటి పత్రాలు, ఇంటి తాళాన్ని బుధవారం చైత్ర తల్లితండ్రులకు అందజేశారు. అలాగే ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ తోపాటు ఉపముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, కలెక్టర్ శర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *