![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2023/10/Untitled-Project-15-4.jpg?resize=1024%2C576&ssl=1)
కాంగ్రెస్‌ను నమ్మి తెలంగాణ ప్రజలు ఓటు వేయొద్దని కల్యాణ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అక్కడి రైతుల బాధ కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. కర్ణాటకలోని రాయిచూర్‌కు చెందిన రైతులు మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కల్యాణ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఆశపడి మేము ఓటేసి గెలిపించాము, ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటకలో గత ప్రభుత్వాలు రైతులకు 12 గంటల కరెంట్ ఇస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 3 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేసారు. కరెంట్ కష్టాల వల్ల రైతు పంటకు సరిపడా నీరు అందడం లేదని, పైరు ఎండి పోతుందని, బాధ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చెప్పే 6 హామీలు కనీసం 6 నెలలైనా అమలు కావని, తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఆరు హామీల పేరిట ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారి దృష్టికి వచ్చినట్టు తెలిపారు, అందుకే తెలంగాణ ప్రజలకు మా విన్నపం మీరు కాంగ్రెస్‌ని నమ్మి మా వలే మోసపోవద్దని ఆవేదన వ్యక్తం చేశారు.