బీఆర్ఎస్ విధానాల్ని ఏపీలో అమలు చేయడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ బీఆర్ఎస్ నేతలు కుండబద్దలు కొట్టి చెప్పారు. ది మ్యాన్ విత్ మిషన్ గా పేరుగాంచిన తోట చంద్రశేఖర్ కి భారత రాష్ట్ర సమితి ఏపీ శాఖ బాధ్యతలు అప్పగించడం వెనుక పటిష్టమైన ప్రణాళిక ఉందని క్రమక్రమంగా ఏపీ ప్రజలు బీఆర్ఎస్ వైపు మరలుతున్నారని వక్తలు కొనియాడారు. తోట చంద్రశేఖర్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో భారాస కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా టీడిపి, వైసీపి ప్రభుత్వాల అసమర్ధ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేసారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టి ప్రత్యామ్యాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణాలో జరుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ వర్గాల వారు బీఆర్ఎస్ లో చేరుతున్నారని పునరుద్ఘాటించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని రాబోయే రోజుల్లో తెలంగాణా నమూనాని ఏపీలో అమలు చేసే సమర్ధత డాక్టర్ తోట చంద్రశేఖర్ కి మాత్రమే ఉందని పలువురు వక్తలు కొనియాడారు. తెలంగాణా మోడల్ అభివృద్ధి ఏపీలో విస్తరించాలంటే ఏపీలో కేసిఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ప్రజా సమస్యలపై నిరంతరం బీఆర్ఎస్ పోరాడుతుందని నేతలు స్పష్టం చేశారు. ఏపీలో బీఆర్ఎస్ ని విస్తరించే క్రమంలో దైవ సంకల్పం కూడా తోడు కావాలని డాక్టర్ తోట చంద్రశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక హోమాన్ని కూడా నిర్వహించారు.
వివిధ జిల్లాల నుంచి పార్టీలోకి భారీగా చేరికలు
తోట చంద్రశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించింది. కొవ్వూరు నుండి టి.నాగరాజు, నెల్లూరు నుండి సురేష్, చంద్రా రెడ్డి , నాగరాజు, షేక్ ముజీబ్,తిరుపతి నుండి ధనుంజయ రాజు, సైదాపురం నుండి మల్లిఖార్జున్, రాజంపేట నుండి పునీత్ ,కిషోర్ రెడ్డి , శ్రీను, జాకీర్ ,త్రినాద్,కిరణ్ , హేమంత్ ,అభినయ్, గుడివాడ నుంచి సాయి తదితరులు తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.