mt_logo

యాదగిరిగుట్టను మోడల్ టౌన్ గా అభివృద్ధి చేయాలి: సీఎస్

యాదగిరిగుట్టలో మోడల్ బస్ స్టేషన్ నిర్మాణానికి తగు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె. జోషి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో YTDA సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, YTDA వైస్ ఛైర్మన్ కిషన్ రావు, దేవాదాయశాఖ కమీషనర్ అనీల్ కుమార్, CDMA టి.కె. శ్రీదేవి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, TSSPDCL CMD రఘుమారెడ్డి, యాదాద్రి టెంపుల్ EO గీత, పోలీస్, ఫైర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట బస్ స్టేషన్ నిర్మాణానికి కాలపరిమితి విధించుకొని పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దగుట్టలో 132/33 KV సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలన్నారు. యాదగిరిగుట్టను మోడల్ టౌన్ గా అభివృద్ధి చేయడానికి అవెన్యూ ప్లాంటేషన్, స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్, పార్కుల అభివృద్ధి, మార్కెట్ లు, జంక్షన్ల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజి, ఫుట్ పాత్ ల నిర్మాణం, డంపింగ్ యార్డు తదితర పనులు చేపట్టే కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. యాదగిరిగుట్టలో కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫైర్ స్టేషన్, రోడ్ల వెడల్పు, గండిచెరువు అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, మంచినీటిసరఫరా, వేద పాఠశాల, శ్రీ లక్ష్మీనరసింహ స్కల్పచర్ ఆర్కిటెక్చర్ ఇనిస్టిట్యూట్ ల ఏర్పాటు తదితర అంశాలపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *