
రైతు బంధు, దళిత బంధు బందు చేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన రేవంత్ కాంగ్రెస్ క్రూర ప్రవృత్తికి నిదర్శనమని, బీఆర్‌ఎస్ సీనియర్ దాసోజు శ్రవణ్ ట్విట్టర్‌లో విమర్శించారు. తెలంగాణ ప్రజల పొట్టలు కొట్టడానికి రేవంత్ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టండని సూచించారు. రేవంత్ కాంగ్రెస్ నేతలకు కర్రు కాల్చి వాతలు పెట్టండి… రైతు బంధు ఆపేయ్యలనే రాబందువుల్లారా.. దళిత బంధు ఆపమంటున్న దగా కోరుల్లారా… కొనసాగుతున్న మహత్తరమైన సంక్షేమ పథకాలను ఆపేయ్యలనే కుట్ర ఈ రేవంత్ కాంగ్రెస్ నేతలదని మండిపడ్డారు.
అడ్డమైన ఆలోచనలతో అన్నదాతల పొట్టలు కొడుతారా? అని ప్రశ్నించారు దరిద్రమైన ఆలోచనలతో దళితులను ఆగం చేస్తారా? అని అడిగారు. అన్నం పెట్టే రైతును ఆగం చేస్తే ఎన్నికల్లో మీకు పిండం పెట్టేందుకు రైతన్న సిద్ధంగా ఉన్నారని దళిత బంధు జోలికి వస్తే మీ లాగులు పగలకొట్టడానికి రెడీగా ఉన్నారని హెచ్చరించారు.తస్మాత్ జాగ్రత్త అని సూచించారు. కుటిలమైన, కుళ్లిపోయిన పేదలపట్ల వ్యతిరేక ఆలోచనలున్న రేవంత్ కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు.