mt_logo

మహా జాతరకు మేడారం సిద్ధం : సీఎస్ సోమేశ్ కుమార్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మేడారం జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసు, రెవిన్యూ, గిరిజన, దేవాదాయ, వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయితీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా, విధ్యుత్, పశు సంవర్ధక శాఖ, రోడ్లు భవనాలు, నీటిపారుదల, ఆర్టీసీ తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ… దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈ నెల 16 నుండి 19 వరకు జరగనుందని, ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కుడా భక్తులు రానున్నారని తెలిపారు. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా కోటికి పైగా భక్తులు జాతరకు వస్తారని అంచనా వేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ, ఇంజనీరింగ్ విభాగాల పనులన్నీ దాదాపు పూర్తి చేశామని వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చూడాలని అన్నారు. శుక్రవారం ఉదయం జంపన్న వాగులోకి నీటిని విడుదల చేశామని, జాతరకు వచ్చే భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ ద్వారా 3850 బస్సులు నడిపి 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. మేడారంలో ప్రధాన ఆసుపత్రి ఏర్పాటుతోపాటు మరో 35 హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేయడంతోపాటు, ఫుడ్ సెఫీటి అధికారులను నియామించామని తెలిపారు. రోడ్లు భవనాల శాఖద్వారా రోడ్ల నిర్మాణం, మరమత్తులు పూర్తి చేశామని, 327 లొకేషన్లలో 6700 టాయిలెట్లతోపాటు, మరిన్ని స్నాన ఘట్టాల ఏర్పాటు చేశామని తెలియజేశారు. అంటువ్యాధులు, నీటి కాలుష్యం కాకుండా ఉండేందుకై నిరంతరం క్లోరినేషన్ చేసేలా చర్యలు తీసుకున్నామని, శానిటేషన్ పర్యవేక్షణకు 19 జిల్లాల పంచాయతీ రాజ్ అధికారులను జాతరలో నియమించామని, అలాగే 5000 మంది సిబ్బందిని పంచాయితీ రాజ్ శాఖ నుండి ఏర్పాటు చేశామని అన్నారు. నిరంతర విధ్యుత్ ఉండేలా అదనపు సబ్ స్టేషన్లు, ట్రాంఫార్మర్లను ఏర్పాటు చేసామని తెలిపిన సీఎస్, జాతరలో 18 ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లల కోసం క్యాంపులు ఏర్పాటు చేసామన్నారు.

రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ నుండి విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. విస్తృత బందోబస్తు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, తొక్కిసలాట కాకుండా గతంలో అనుభవం ఉన్న పోలీస్ అధికారులను విధుల్లో నియమించామని తెలిపారు. దాదాపు 9000 పోలీసు అధికారులను విధుల్లో నియమించామని, ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ తోపాటు, ఫైర్ ఇంజన్లను సరిపడా ఏర్పాటు చేసామన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో స్పెషల్ సీఎస్ లు ఆధార్ సిన్హా, రజత్ కుమార్, అరవింద్ కుమార్, ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, జయేష్ రంజన్, కార్యదర్శులు రిజవి, క్రిష్టినా జొన్తు, శ్రీనివాస రాజు, ఎండోమెంట్ కమీషనర్ అనిల్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, ఐజి లు నాగి రెడ్డి, సంజయ్ జైన్, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పి సంగ్రామ్ సింగ్ పాటిల్. వివిధ ఇంజనీరింగ్ విభాగాల ఈ.ఎన్.సి లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *