mt_logo

చెరువుల రిపోర్ట్‌తో అడ్డంగా బుక్కైన కాంగ్రెస్!

హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పేరు మీద తాము చేస్తున్న కూల్చివేతలను సమర్థించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఒక రిపోర్ట్ విడుదల చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 2014కు ముందు, 2014కి తర్వాత ఎన్ని చెరువుల ఆక్రమణలకు గురయ్యాయో ఈ రిపోర్ట్‌లో పొందుపరిచింది.

అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో దగ్గరుండి చెరువుల కబ్జాలకు ప్రోత్సహించింది అని చూపెట్టే కుటిల ప్రయత్నంలో పెద్ద సెల్ఫ్ గోల్ చేసుకుంది. 97% కన్నా ఎక్కువ శాతం చెరువుల ఆక్రమణలు 2014కు ముందే కాంగ్రెస్, టీడీపీ హయాంలో జరిగాయని ఆ రిపోర్టు తేటతెల్లం చేసింది. 

అంటే.. ఇన్నాళ్లూ బీఆర్ఎస్ చెప్పిందే నిజం అని రేవంత్ ప్రభుత్వ రిపోర్ట్ నిరూపించింది. 2014కి ముందు 225 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయని, 196 చెరువులు పాక్షికంగా కబ్జాకు గురయ్యాయని.. అదే బీఆర్ఎస్ హయాంలో అవి పదవ వంతు తగ్గాయని రిపోర్ట్ స్పష్టం చేసింది.

అయితే ఆ రిపోర్ట్‌లో బీఆర్ఎస్ హయాంలో 20 చెరువులు కబ్జా అయ్యాయని కొన్ని మ్యాపులు పెట్టారు. కానీ.. అందులో కనీసం 17 చోట్ల ఇంతకుముందు అసలు చెరువు ఉన్న ఆనవాలు కూడా లేదు. 

కేవలం పొలాల మీద, ఖాళీ స్థలాల మీదా మ్యాప్ మీద గీతలు గీసి వాటిని చెరువులు అంటున్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద బురదజల్లాలనే.. ఇటువంటి విఫలయత్నం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నిన్నటి రిపోర్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద అణుబాంబు లాంటిది అని పరిశ్రమ వర్గాలు నెత్తి కొట్టుకుంటున్నయి. దాదాపు 15 పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ కాంప్లెక్సులు ఈ ఊహాజనితమైన చెరువుల సమీపంలో ఉన్నాయట. 

ఇవ్వన్నిటి మీదికి హైడ్రా పోతే భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో ఎవరూ అపార్ట్‌మెంట్ కొనడానికి ముందుకు రారు అని రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు వాపోతున్నారు. నిన్న, మొన్నటివరకు పేద, మధ్య తరగతి ఇండ్ల మీదికి పోయినప్పుడు హైడ్రాకు చప్పట్లు కొట్టిన కొన్ని సెక్షన్లు కూడా ఇప్పుడు హైడ్రా మీద దుమ్మెత్తి పోస్తున్నారు. 

రేవంత్ ప్రభుత్వం ఎంత అయోమయం, గందరగోళంలో ఉన్నదో, దాని వల్ల తెలంగాణకు ఎంత నష్టం జరుగుతున్నదో నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రిలీజ్ చేసిన హైదరాబాద్ చెరువుల రిపోర్ట్ తాజా సాక్ష్యం.