
నిరుద్యోగుల సమస్యల మీద గత కొన్ని నెలలుగా క్రియాశీలకంగా కొట్లాడుతున్న జాబ్ ఆస్పిరెంట్ గాదె సింధు రెడ్డి విషయంలో నిన్నటి నుండి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసి సెల్ఫ్ గోల్ చేసుకుంది.
నిజానికి ఈ స్క్రిప్ట్ టీడీపీ టెంప్లేట్. ప్రతి విషయం మీద పెయిడ్ ఆర్టిస్టులను దింపడం, దాని గురించి సోషల్ మీడియాలో రాద్దాంతం జరగడం పక్క రాష్ట్ర రాజకీయాల్లో తరుచుగా చూస్తుంటాం.
కానీ ఉద్యమాల గడ్డ తెలంగాణలో అలా ఎప్పటికీ జరగదు. నిజమైన ప్రజా ఉద్యమాలు జరిగే ఈ నేల మీద పెయిడ్ ఆర్టిస్టుల అవసరం ఎవరికీ లేదు. నిన్న జరిగిన విద్యార్థి ఆందోళనలు చూసి బెంబేలెత్తిన రేవంత్ సర్కార్ నష్టనివారణ చర్యల్లో భాగంగా ఈ టెంప్లేట్ వాడి ఘోరంగా విఫలమైంది అని పలువురు విశ్లేషకులు అంటున్నారు.
నిన్న సాయంత్రం సింధు రెడ్డిని పెయిడ్ బ్యాచ్ అనే తప్పుడు ముద్ర వేసి సోషల్ మీడియాలో కొన్ని కాంగ్రెస్ హ్యాండిల్లు దుష్ప్రచారం చేశాయి. కానీ, కొన్ని నిమిషాల్లోనే తెలంగాణ బిడ్డలు కాంగ్రెస్ దుష్ప్రచారానికి మూహ్ తోడ్ జవాబు ఇచ్చిండ్రు. సింధు రెడ్డి గతంలో రేవంత్, మధు యాష్కీ, కోదండరాం, ధనసరి అనసూయ, చింతపండు నవీన్ వంటి కాంగ్రెస్ నాయకులతో ఉన్న ఫోటోలు, వీడియోలు బయట పెట్టారు.
దీంతో కాంగ్రెస్ ప్లాన్ బ్యాక్ ఫైర్ అయ్యి ఇప్పుడు నిరుద్యోగుల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. నిన్నటి దాకా తమను వాడుకుని, ఇప్పుడు విస్మరించడం, మోసం చేయడమే కాక ఏకంగా తమ మీదనే పెయిడ్ బ్యాచ్ అని ముద్ర వేసిన కాంగ్రెస్ మీద తెలంగాణ యువత మండిపడుతున్నారు.