రైతాంగానికి ఉచిత కరెంటు పై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిన టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి పై రైతులు భగ్గుమంటున్నారు. ఒక ఎకరా పారేందుకు గంట సేపు కరెంటు చాలు.. అంటే మూడెకరాలకు మూడు గంటలే చాలు.. 24 గంటల కరెంట్ అవసరం లేదన్నా రేవంత్ రెడ్డి మాటలకు కడుపు మండిన రైతులు కాంగ్రెస్ పార్టీకి మా ఊర్లోకి ప్రవేశం లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటూ కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో బుధవారం ఫ్లెక్సీలు వెలిశాయి. పంట సాగుకు 3 గంటల విద్యుత్తు సరిపోతుందన్న రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులు తమ గ్రామాల్లోకి రావొద్దని స్పష్టం చేస్తూ.. ఈ ఫ్లెక్సీలు మొదట కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద కరీంనగర్-సిరిసిల్ల ప్రధాన రహదారిపై స్థానిక రైతులు ఏర్పాటు చేశారు. ఈ స్ఫూర్తితోనే బద్దిపల్లి, బావుపేట, ఖాజీపూర్ గ్రామాల్లో మరియు కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్, కొత్తపల్లి మండలం కమాన్‌పూర్, ఎలగందుల తదితర గ్రామాల్లోనూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉచిత కరెంట్ ఇవ్వమంటూ తమను అవమానించిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పడానికే ఈ గ్రామ ప్రజలు ఈ విధానాన్ని ఎన్నుకున్నట్టు తెలుస్తుంది.