mt_logo

అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్.. అవినీతి రాజ్యానికి రారాజు రాహుల్

  • రాహుల్ గాంధీ కాదు రిమోట్ గాంధీ 
  • తెలంగాణ కు ద్రోహం  చేసింది కాంగ్రెస్  పార్టీ

రాహుల్ గాంధీ ని పప్పు అంటే నేను  బాధ పడే వాడిని నిన్న ఖమ్మం సభలో రాహుల్ మాట్లాడిన  తీరు చూస్తుంటే  పప్పు అనడంలో తప్పేమి లేదు అనిపిస్తుందన్నారు మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి. ఇక్కడ  కాంగ్రెస్  సన్నాసులు రాసిచ్చిన  స్క్రిప్ట్  రాహుల్ చదివి వెళ్లిపోయారు. వచ్చామా  మాట్లాడామా పోయామా అన్నట్టు ఉంది రాహుల్  తీరు. రాహుల్ కు అవగాహన లేదు పరిజ్ఞానం లేదు. అసలు  రాహుల్ కు కాంగ్రెస్ లో ఏ హోదా ఉందో అర్థం కాదని అన్నారు. ఏ పదవి లేకున్నా రాహులే అన్నీ కాంగ్రెస్ లో నడిపిస్తారా.. రాహుల్ గాంధీ కాదు రిమోట్ గాంధీ లా వ్యవహరిస్తున్నారన్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ గురించి అంతా తెలుసు కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు.  

రాహుల్ కు  కాంగ్రెస్ లో  ఏ  పదవి  ఉందని  హామీలు ఇస్తున్నారు 

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో చెప్పకుండా ఇక్కడ అది చేస్తాం ఇది చేస్తాం అని రాహుల్ చెబుతున్నారు. మొన్ననే కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి, అక్కడ 4 వేల పెన్షన్ ఇస్తున్నారా? అక్కడ  ఇస్తామని ఎందుకు  చెప్పలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వెయ్యికి మించి వృద్దులకు పెన్షన్ ఇవ్వడం లేదు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లా.. ఏది పడితే అది నమ్మడానికి అని దుయ్యబట్టారు. 4 వేల పెన్షన్ కాంగ్రెస్  పాలిత  రాష్ట్రాల్లో ఇచ్చి రాహుల్ ఇక్కడ ఇస్తానని చెప్పాలి అసలు పెన్షన్ గురించి రాహుల్ కు తెలుసా? అని అడిగారు. అవినీతి గురించి రాహుల్ మాట్లాడటమా… అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్.. అవినీతి రాజ్యానికి రారాజు రాహుల్… ఆయన నాన్న అవినీతి ఆరోపణలతోనే ఓడిపోయారని గుర్తు చేసారు. కేసీఆర్ ది రాచరికం కాదు. రాజు కారు.. 88 సీట్లు  గెలిచి రెండోసారి సీఎం అయ్యారు… రాహుల్  ఎంపీగా  ఓడిపోయారు.. అసలు రాహుల్ కు  కాంగ్రెస్ లో  ఏ  పదవి  ఉందని  హామీలు  ఇస్తున్నారు. రాహుల్  కాంగ్రెస్ లో తానే రాజు అనుకుంటున్నారా? అని అడిగారు. 

వందలాది మంది అమరులు కావడానికి కాంగ్రెస్  పార్టీ కారణం 

కాంగ్రెస్  లో మీది రాచరిక కుటుంబ టీం కాదా! కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు  80 వేల కోట్లు కూడా కాలేదు లక్ష  రూపాయల  అవినీతి జరిగిందని రాహుల్  అంటారా? దీన్ని బట్టే తెలుస్తోంది  రాహుల్ కున్న పరిజ్ఞానం ఏమిటో అని మండిపడ్డారు. తెలంగాణ కు మొదట్నుంచి ద్రోహం  చేసింది కాంగ్రెస్  పార్టీయే .. తెలంగాణను  బలవంతంగా  ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్  పార్టీ కాదా.. వందలాది మంది తెలంగాణ ఉద్యమంలో అమరులు కావడానికి కాంగ్రెస్  పార్టీ కారణం కాదా?  2004లోనే తెలంగాణ  ఇచ్చి ఉంటే ఇంత మంది చనిపోయేవారు కాదు. విధి లేని పరిస్థితుల్లోనే  అనివార్యంగా కాంగ్రెస్ పదేళ్ల ఆలస్యంగా తెలంగాణ ఇచ్చింది. రాష్ట్రం పదేళ్లు ఆలస్యం కావడం వల్ల  తెలంగాణ అభివృద్ధి  వెనక్కి నెట్టబడింది.. దానికి కాంగ్రెస్  కారణం కాదా.. మేము ఎవ్వరికీ బీ టీం కాదు.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పని చేశాయి. కావాలంటే ఈటెల రేవంత్ హోటల్లో కలుసుకున్న  ఫోటోలు  రాహుల్ కు  పంపిస్తా అన్నారు.