రైతుల పంట రుణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం వనపర్తి నియోజకవర్గంలోని మింటపల్లి గ్రామపంచాయతీలో పర్యటించిన ఆయన… వడ్డీతో సహా విడుతల వారీగా పూర్తి రుణమాఫీ జరుగుతుందని, తెలంగాణలో ఏ ఒక్క రైతు బాకీ ఉండకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సొంత జాగలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకోవడానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే రానున్నాయని తెలిపారు. ఇతర పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దు అని మంత్రి సూచించారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి, తెలంగాణలో భవిష్యత్‌లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని ఉద్ఘాటించారు.