mt_logo

ఆచ‌ర‌ణ‌లో కేటీఆర్ మంత్ర‌.. 1.8 టన్నుల రీసైకిల్‌ వస్తువుల సేకరణ

భూ, జ‌ల కాలుష్యానికి అనేక ర‌కాల ప్లాస్టిక్‌, ఇత‌ర వ‌స్తువులు కార‌ణ‌మ‌వుతుంటాయి. కొంత‌మంది అవ‌స‌రంలేకున్నా వ‌స్తువుల‌ను అద‌నంగా స‌మ‌కూర్చుకొంటారు. కాస్త  పాత‌ప‌డ‌గానే చెత్త‌కుండీల్లోకి చేర్చుతారు. దీంతో ఆ వ‌స్తువులు ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో క‌లుషితం చేస్తున్నాయి. మ‌రి దీనికి ప‌రిష్కారంగా  పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారక రామారావు ఆలోచనల్లోంచి వచ్చిందే ‘రెడ్యూస్‌, రీసైకిల్‌, రీయూజ్‌’ అనే ట్రిపుల్‌ ఆర్‌ మంత్రం.. ఇది ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లింది. ప్రతి శనివారం రీథింకింగ్‌ డేగా నిర్వహిస్తూ.. పౌరులకు మేలు చేయాలని మంత్రి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తున్నది.

రీథింకింగ్‌ డేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ స్థానిక సంస్థలలోని మొత్తం 180 సెంటర్ల నుంచి దాదాపు 1.8 టన్నుల రీసైకిల్డ్‌ వస్తువులను సేకరించినట్టు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ తెలిపారు. దుస్తులు, పుస్తకాలు, పాదరక్షలు, ప్లాస్టిక్‌ వస్తువులు విరివిగా ప్రజల నుంచి సేకరించిట్టు పేర్కొన్నారు. ఈ సేకరించిన వస్తువులను ఆయా ఎన్జీవోల ద్వారా పలు కమ్యూనిటీల్లో అవసరమైన నిరుపేదలకు పంపిణీ చేయనున్నారు. ఇలా ప‌నికొచ్చే వ‌స్తువులు చెత్త‌లో చేరి హాని త‌ల‌పెట్ట‌కుండా.. నిరుపేద‌ల అవ‌స‌రాలు తీరుస్తున్నాయి. రెడ్యూస్‌.. రీసైకిల్‌.. రీయూజ్‌.. అనే కేటీఆర్ మంత్ర‌తో అటు వ్య‌ర్థాల‌కు చెక్ ప‌డుతుండ‌గా.. నిరుపేద‌ల అవ‌స‌రాలు తీరుతున్నాయి.